ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ.. ఇంతకీ దీనికి ఏమైంది?

Biggest python in world was died in bomb blast

01:18 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Biggest python in world was died in bomb blast

పాము అంటేనే భయం. ఇక అనకొండ అంటేనా ఆమ్మో అనేస్తారు. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ బ్రెజిల్ లో బయటపడింది. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వీరలెవెల్లో కామెంట్లు పడేస్తున్నారు. బ్రెజిల్ లోని ఉత్తరప్రాంతంలో అల్టామిరా వద్ద బెలో మాంటె డ్యాం నిర్మాణ పనుల్లో భాగంగా పేలుడు జరిపినప్పుడు ఈ అనకొండ బయటపడింది. 33 అడుగుల పొడవున్న ఈ పాము 400 కేజీల బరువుంది. పాము వెడల్పు మీటరుకు పైగా ఉంది. అతిపెద్దదైన ఈ పామును చూడగానే కార్మికులు తొలుత షాకయ్యారు. అయితే తర్వాత పాము పేలుడులో చనిపోయిందని తెలుసుకుని భారీ క్రేన్ తో ఎత్తి పక్కకు పెట్టేశారు.

అయితే పాము పేలుడులో చనిపోయిందా లేక చంపేశారా అనే విషయంపై సోషల్ మీడియాలో బిగ్ ఫైట్ నడుస్తోంది. పాపం పామును చంపేస్తారా అంటూ కొందరు జంతు ప్రేమికులు విరుచుకుపడ్డారు. మరోవైపు గిన్నీస్ బుక్ రికార్డుల ప్రకారం అమెరికాలోని కన్సాస్ నగరంలో 25 అడుగుల రెండు అంగుళాలున్న అనకొండయే అతి పెద్ద పాముగా రికార్డులకెక్కింది. మరి ఇది 33 అడుగులు వుంది కదా..

English summary

Biggest python in world was died in bomb blast