ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంటు ఇదే!

Biggest solar plant in world

12:56 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Biggest solar plant in world

తమిళనాడులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంటుగా దీన్ని చెబుతున్నారు. అదానీ గ్రూప్ నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ దీన్ని జాతికి అంకితం చేసింది. ఈ ప్లాంటు 648 మెగావాట్లను ఉత్పత్తి చేస్తోందని అధికారికంగా దీనిని జాతికి అంకితం చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. తమిళనాడులోని రామాంతపురం వద్ద గల కముతిలో ఈ ప్లాంటును ఏర్పాటు చేశాం. రూ.4550 కోట్ల పెట్టుబడి పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమైన 3000 మెగావాట్ల ఉత్పత్తిలో భాగమే ఇది అని అందులో తెలిపింది. తమిళనాడుతో పాటు మొత్తం దేశానికే ఇది ఒక మరపురాని జ్ఞాపకం.

దీనిని దేశానికి అంకితం చేయడంపై మేం సంతోషంగా ఉన్నాం. ప్రపంచంలోనే పర్యావరణహిత విద్యుత్ తయారీదార్లలో భారత్ ను ముందుంచడానికి ఈ ప్లాంటు సామర్థ్యం ఉపయోగపడగలదు అని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఈ ప్లాంటును ఏర్పాటు చేయడం కోసం కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి సామగ్రిని, యంత్రాలను రప్పించుకుంది.

ఇది కూడా చదవండి:దారుణం: కన్నకూతురుకి కడుపు చేసిన తండ్రి.. ఆపై..

ఇది కూడా చదవండి:నేను తాగితే ఆ రాత్రి నా భర్త పని అయిపోయినట్టే!

ఇది కూడా చదవండి:శ్రీవారికి తలనీలాలు సమర్పించిన మహేష్ భార్య

English summary

Biggest solar plant in world