ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం' ఎక్కడుందో తెలుసా?

Biggest Vishnu temple in world

05:03 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Biggest Vishnu temple in world

హిందూ దేవాలయాలు చాలా చోట్ల వున్నాయి. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం'/'విష్ణుదేవాలయం' మన భారతదేశంలో లేదని, అది కాంభోజ దేశంలో వుందని అంటున్నారు. 'ఆంగ్కోర్ వాట్'/'ఆంగ్కోర్ వేట్' ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా(ప్రాచీన నామం 'కంపూచియా') లోని అంగ్ కోర్ వద్ద 12వ శతాబ్ధంలో సూర్యవర్మన్ నిర్మించారు. ఇది 'వైష్ణవాలయం'/'విష్ణుదేవాలయం'. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించారట. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం ఇది. భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తడం సహజం. అయితే అసలు విషయానికొస్తే..

1/6 Pages

పూర్వకాలంలో కాంభోజ దేశం అని పిలిచేవారు..

ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో కాంభోజ దేశం అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది. పూర్వకాలంలో కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్ధాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

English summary

Biggest Vishnu temple in world