బీజేపీని ఢీకొట్టిన నితీష్ కు ఆ డాన్ అంటే వణుకా?

Bihar cm Nitish Kumar afraiding for that Don

06:23 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Bihar cm Nitish Kumar afraiding for that Don

పదేళ్ల నుంచి బీహార్ ప్రశాంతంగా ఉంది. క్రైం రేటు తగ్గింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా బీహార్ ముఖ్యమంత్రి పరిస్థితి తయారయింది. బీజేపీ లాంటి పెద్ద పార్టీలకే అదరని, బెదరని ఈ ముఖ్యమంత్రి, వాళ్ళను బలంగా ఢీకొని గెలిచాడు. అయితే ఓ గూండా జైలు నుంచి రాగానే ఈ సీఎం వణికిపోతున్నారు. ఒక మాజీ సీఎం అండతో ఆ గుండా ప్రస్తుత సీఎంను వణికిస్తున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో భూకంపం తెప్పిస్తున్నాడు. ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంజనీర్ల హత్యలు జరిగాయి. లాలూ ప్రసాద్ కు నమ్మిన బంటు, బీహార్ డాన్ జైలు నుంచి విడుదల కావడంతో పోలీసులు సైతం వణికిపోతున్నారు.

బీహార్ కు నితీష్ సీఎం కావచ్చు తనకు మాత్రం లాలూనే నాయకుడంటూ షాబుద్దీన్ బాంబు పేల్చాడు. లాలూ మాట తప్ప ఎవరి మాటా విననంటూ తేల్చిచెప్పాడు. హత్యలు చేసి జైలుకు వెళ్లిన షాబుద్దీన్ ఏదో ఘనకార్యం చేసినట్లు జైలు నుంచి రాగానే తన అనుచరులతో ఘనస్వాగతం చెప్పించుకున్నాడు. ముజఫర్ పూర్ టోల్ గేట్ దగ్గర ట్యాక్స్ కట్టకుండానే షాబుద్దీన్ కాన్వాయ్ దాటింది. కాన్వాయ్ అంటే రెండో, మూడో వాహనాలు కాదండి బాబూ, ఆ కాన్వాయ్ లో ఏకంగా రెండు వందల వాహనాలు ఉన్నాయి. టోల్ తీసుకోవద్దంటూ పోలీసులు టోల్ గేట్ సిబ్బందికి ముందుగానే చెప్పారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, మధుకోడా లాంటి వారికి లాలూ రియల్ కింగ్ అంటూ షాబుద్దీన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మాత్రమే నితీష్ సీఎం అయ్యారని అన్నాడు. జైలు నుంచి వచ్చిన తనలో ఎలాంటి మార్పు రాలేదని షాబుద్దీన్ చెప్పుకొచ్చాడు. దీంతో షాబుద్దీన్ నేర చరిత్ర చూసి బీహార్ పోలీసులు భయపడ్డారు. శివాన్ లో 2004లో జరిగిన సీనియర్ జర్నలిస్టుల హత్యకేసులో షాబుద్దీన్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. వరుసగా నాలుగు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన షాబుద్దీన్ ఆర్జీడీలో కీలక నేతగా వున్నాడు. లాలూ సీఎంగా ఉన్నప్పుడు కుడిభుజంగా ఉండేవాడు. 2005లో నితీష్ సీఎం అయ్యాక తనపై ఉన్న తప్పుడు కేసులను తిరగదోడి జైలుకు పంపారని ఆరోపించాడు.

నితీష్ పేరు అంటేనే అంతెత్తున లేస్తున్నాడు. షాబుద్దీన్ సీరియల్ కిల్లర్ కావడంతో 2009లోనే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటుపడింది. జైల్లో ఉండి అనుచరులతో రిగ్గింగ్ చేయించి తన భార్యను ఎంపీగా గెలిపించుకున్నాడు. అదీ అతడి ట్రాక్ రికార్డు. 1986 నుంచి షాబుద్దీన్ పై క్రైం రికార్డు ఉంది. పదికి పైగా హత్య కేసులు ఉన్నాయి. శివాన్ కేంద్రంగా మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బీహార్ కు సీఎం నితీష్ అయినా, 243 సీట్లున్న అసెంబ్లీలో మాత్రం మెజార్టీ ఆర్జీడీదే. జేడీయూకి 71 సీట్లు ఉండగా ఆర్జీడీకి 80 సీట్లు ఉన్నాయి. శాసనసభలో కీలక శాఖలన్నీ ఆర్జీడీవే. అలాంటి ఆర్జీడీలో షాబుద్దీన్ కీలక నేత కావడం విశేషం. షాబుద్దీన్ రాజకీయ గురువు అయిన లాలూ దగ్గరే బీహార్ రాజకీయాలను శాసించే రిమోట్ ఉంది. పాలనపై నితీష్ కు నియంత్రంణ లేదు. అందుకే షాబుద్దీన్ అరాచకానికి పాల్పడితే నితీష్ మౌన ప్రేక్షకుడిలా ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట.

English summary

Bihar cm Nitish Kumar afraiding for that Don. Bihar Chief Minister Nitish Kumar afraiding by seeing big don. And he is releasing from jail.