స్టాక్ మార్కెట్ పై 'బిహారీ' ప్రభావం

Bihar Election’s  Effect On Stock Market

12:18 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Bihar Election’s  Effect On Stock Market

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ మొదలైన మొదటి అరగంటలో సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఐదువారాల తర్వాత మొదటిసారి 26వేల మార్కు కిందకు పతనమైంది. నిఫ్టీ కూడా 120 పాయింట్లు పడిపోయింది. అయతే ఆతర్వాత దేశీయ విపణులు కొద్దిగా కోలుకున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో బీఎస్సీ సెన్సెక్స్ 367 పాయింట్ల నష్టంతో 25,900 పాయింట్ల వద్ద , నిఫ్టీ 115 పాయింట్ల నష్టంతో 7,838 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా బులియన్ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయి. 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.318 తగ్గి 25,523గా పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.590 తగ్గి రూ.34,910గా పలుకుతోంది. డాలర్ మారకం విలువ రూ.66.30 పైసల వద్ద ట్రేడవుతోంది. మొత్తానికి నితిశే - లాలూ జోడీ ఇచ్చిన షాక్ స్టాక్ మార్కెట్ ని కుదిపింది.

English summary

Bihar Election’s  Effect On Stock Market