ఇంట్లో పొయ్యి వెలిగించారో జైలు శిక్ష తప్పదు

Bihar Government Ordered Not To Cook Between 9AM to 6PM

12:55 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Bihar Government Ordered Not To Cook Between 9AM to 6PM

మన దేశంలో ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి . ఇలా ఈ అగ్ని ప్ర‌మాదాల వ‌ల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు , భారీగా ఆస్తి నష్టం కూడా ఎక్కువ‌గా వస్తోంది . అగ్ని ప్రమాదాలను కంట్రోల్ చేసేందుకు ఇండియాలోని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నా అగ్ని ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి . అయితే అగ్ని ప్రమాదాలను తగ్గించేందుకు బీహార్ లోని నితీష్ కుమార్ ఓ అనూహ్యమైన ఆదేశాన్ని జారీ చేసింది . ప్రజలు వంట చేసుకోడానికి ఇంట్లో పొయ్యి వెలిగించారో జైలు శిక్ష తప్పదని ఓ నిబంధ‌న విధించింది.

ఇవి కూడా చదవండి: రామ్ చరణ్ తేజ్ ప్రొడక్షన్ హౌస్ లోగో ఇదే

ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 6 గంటల మధ్య అసలు పొయ్యి వెలిగించకూడదని , కుంపట్లు, కట్టె పొయ్యులు లాంటివి కుడా వెలిగించోద్దని . అంతేకాకుండా బీహార్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ్యాస్ ఈ సమయంలో వంట, పూజ, యాగాలు వంటివి చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. బీహార్ లోని ఉదయం 9 గంటలలోపే ధూప, దీప నైవేధ్య కార్యక్రమాలాంటివన్నీ పూర్తి చేసుకోవాలని సూచించారు .

ఇవి కూడా చదవండి: వడదెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

ఏదైనా ఫంక్షన్లలో కూడా తందూరి పొయ్యల్లాంటివి వాడరాదని, ఏకంగా అసలు ఫంక్షన్లే వద్దని కూడా బీహార్ ప్రభుత్వం సూచించింది . బీహార్‌లో కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల తీవ్రంగా పెరిగిన కారణంగా ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు అనేక మందికి పైగా చనిపోగా , కోట్ల‌లో ఆస్తిన‌ష్టం జ‌రిగింది . వంట కోసం వెలిగించే కుంపట్ల నుంచి నిప్పురవ్వలు ఎగిరి గుడిసెలు అంటుకుని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి: మోహన్ బాబుకి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ ఫాన్స్

ఇవి కూడా చదవండి: క్షుద్ర పూజలు చేస్తూ దొరికేసిన హీరోయిన్

English summary

Bihar Government advised their state people to not to cook food or do Puja inbetween 9AM to 6PM in the State . Bihar Government take this decision because of increasing temperatures and increasing fire accidents in the state.