కోర్టులో లొంగిపోయిన బీహార్ ఏంఎల్ఏ

Bihar MLA Manorama Devi surrended in court

12:33 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Bihar MLA Manorama Devi surrended in court

గత కొంతకాలంగా అజ్ఞాతంలోకెళ్ళిన బిహార్‌ ఎమ్మెల్సీ మనోరమదేవి మంగళవారం గయ కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఓసారి వివరాల్లోకి వెళితే.. జేడీయూ ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాకీ యాదవ్‌ ఇటీవల ఓ యువకుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. కారు ఓవర్‌టేక్‌ చేశాడన్న కోపంతో ఆదిత్య సచ్‌దేవ అనే యువకుడిని మే 7న రాకీ నడిరోడ్డు పై అందరూ చూస్తుండగా కాల్చి చంపాడు. గతవారం రాకీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆదిత్య హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు మనోరమను కూడా విచారించారు.

కుమారుడిని రక్షించే ప్రయత్నంలో మనోరమ పోలీసులకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. అంతేగాక.. విచారణ సమయంలో మనోరమ ఇంటిని తనిఖీ చేస్తుండగా.. ఆమె ఇంట్లో మద్యం సీసాలు లభించాయి. బిహార్‌లో మద్యం పై సంపూర్ణ నిషేధం ఉంది. దీంతో చట్టానికి వ్యతిరేకంగా మద్యం నిల్వలను ఇంట్లో పెట్టుకోవడంతో ఆమె పై గత బుధవారం పోలీసులు అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. మరోవైపు మనోరమను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రకటించారు. అయితే అప్పటి నుంచి మనోరమ అజ్ఞాతంలో ఉన్నారు. కాగా.. ఇవాళ ఆమె కోర్టులో లొంగిపోవడంతో కోర్టు రిమాండ్ విధించింది.

English summary

Bihar MLA Manorama Devi surrended in court. BIhar MLA Manorama Devi surrended in court due to alcohol case and her son murder case.