నాలుకలు కోసేస్తానన్న బిహార్‌ ఎమ్మెల్యే

Bihar MLA Says That He Will Cut Tongues

01:41 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Bihar MLA Says That He Will Cut Tongues

ఎంఎల్ఎ , ఎంపిలు ఈ మధ్య అధికార అహంకారమో మరేమిటో తెలీదు గానీ చాలామంది బెదిరింపులు , వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కుతున్నారు. అదే కోవలో బిహార్‌లో అధికార జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యంతకర వ్యాఖ్యలు చేసి, వివాదంలో చిక్కుకున్నారు. భగల్‌పూర్‌ జిల్లాలోని గోపాల్‌పూర్‌ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో తన మద్దతుదారులను బెదిరించిన వారి నాలుకలు కోసేస్తా అంటూ హెచ్చరించడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల పై బిహార్‌ ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ధ్వజ మెత్తుతున్నాయి. నౌగాచియా బజార్‌ ప్రాంతంలో క్రికెట్‌ మ్యాచ్‌ ఏర్పాటుచేయడానికి సంబంధించి ఓ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ గోపాల్‌ అతడి ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ప్రశ్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే, జేడీయూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. బిజెపి నేత నందకిశోర్‌ యాదవ్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో జేడీయూ ప్రభుత్వం ఎలా ఉందో ఈ ఘటన అద్దంపడుతోందన్నారు. జేడీయూతో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీ నేతలు కూడా ఈ ఘటన పై కారాలు మిరియాలు నోరుతున్నారు. ఏది ఏమైనా ఇలా వ్యాఖ్యలు చేసి , వార్తలకెక్కడం ఫ్యాషన్ అయిపొయింది.

English summary

Bihar Gopalpur JDU MLA Narendra Kumar Neeraj alias Gopal Mandal has warned his political rivals against insulting him, saying he will cut their tongues.This was opposed by the opposition parties and they said that this was the example of how JDU was ruling Bihar.