ఆకాకరకాయ రేటు వింటే గుండె గుభేల్...

Biiter Gourd price per kilo is 250 rupees

11:18 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Biiter Gourd price per kilo is 250 rupees

అవును నిజంగా గుండె గుభేల్ మనే వార్త ఇది. అయినా అందరూ దీన్ని కొనేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వర్షాకాల సీజన్ లో తొలిసారిగా గురువారం హైదరాబాద్ మార్కెట్ తో పాటు ప్రధాన కూడళ్ల వద్ద బోడ కాకరకాయలను విక్రయించగా, జనం పోటీ పడుతూ కొనుగోలు చేశారు. కిలో చికెన్ కు రూ. 180 ఉండగా మార్కెట్ లో బోడ కాకర కాయకు కిలోకు రూ. 220-250ల డిమాండ్ ఉంది. రేటెంత అయినా కూడా భోజన ప్రియులు బోడ కాకరకాయను కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదు. తెలంగాణ ప్రాంతంలో ఈ బోడ కాకరకాయలు విరివిగా దొరుకుతాయి. వీటిని ఆయా ప్రాంత స్థానికులు, గిరిజనులే ఎక్కువగా సేకరిస్తుంటారు.

బోడ కాకరకాయ రుచికి భోజన ప్రియులు దాసోహం కావడంతో వాటి విక్రయానికి పెరిగిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జిల్లాలలోని కొంత మంది దళారులు నేరుగా సేకరించే వారి వద్దకు వెళ్లి అక్కడే రూ. 50 నుంచి 70 వరకు కొనుగోలు చేస్తూ బయట మార్కెట్ లో రూ. 220లకు పైగానే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని కూరగాయలకు అలాంటి గిరాకీ వుంది మరి.

English summary

Biiter Gourd price per kilo is 250 rupees