బైక్‌ టాక్సి( బాక్సీ) సేవలు ప్రారంభం

Bike Taxi Service Launched

07:13 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Bike Taxi Service Launched

ఒక వినూత్నమైన బైక్‌ టాక్సీ సేవ (బాక్సీ ) ను అధికారంగా ఢిల్లీలోని గుర్‌గ్గావ్‌ లో ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ముందు 23 బైక్‌ టాక్సీలను ప్రారంభించారు. ఈ సేవలను 3-5 కిలోమీటర్ల చిన్న చిన్న దూరాలకు ఉపయోగించుకోవచ్చు.

ఈ సేవలను ఉపయోగించుకోవాలనుకునే వారు 7799777847 అనే నంబరుకు కాల్‌ చేసి లేదా మొబైల్‌ యాప్‌ సహాయంతో కూడా మనం ఈ సేవాలను ఉపయోగించుకోవచ్చు. బాక్సీ తాలుకు సేవల రుసుమును డైరక్ట్‌గా లేదా బాక్సీ వాలెట్‌ ద్వారా చెల్లింపులు చెయ్యవచ్చు. డిప్యూటి కమీషనర్‌ టి. ఎల్‌. సత్య ప్రకాశ్‌ ఈ బైక్‌ టాక్సీ సేవలను ప్రారంభించారు. ఈ ద్విచక్ర టాక్సీ సేవలు హ్యనై, బ్యాంకాక్‌, లండన్‌, గోవా వంటి నగరాల్లో సూపర్‌ హిట్‌ అయ్యామని తెలిపారు.

ఈ బాక్సీ సంస్ధ సిఈవో అశుతోష్‌ మాట్లాడుతూ ఈ నగరం ఒంటరిగా ప్రయాణించే వారు ఎక్కువగా ఉన్నారని అలాంటి వారు ఈ సర్వీసులను ఉపయోగించ్చుకోవచ్చని తెలిపారు. ప్రజలు బైక్‌ టాక్సీలను ఉపయోగించుకోవడానికి సిద్దంగా ఉన్నారని, ఈ విషయాన్ని ఒక సర్వే ద్వారా తెలుసుకున్నామని అన్నారు . ఈ సర్వీసుల కనీస చార్జ్‌ 10 రూపాయలని ప్రతి కిలోమీటరుకు 4 రూపాయలు అదనంగా చెల్లించాలని అన్నారు. రాబోయే 3 నెలలలో బైక్‌ టాక్సీల సంఖ్య 500 లకు పెంచెదుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు.

ఇందులో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రతి డ్రైవరును పోలీసులతో అధికారక తనిఖి చెపడతామని తెలిపారు. ఈ బైక్‌టాక్సీ లోని టెక్నాలజీ తో బైక్ వేగం,లోకేషన్‌,భద్రత వంటి వాటిని ఎప్పటి కప్పడు పర్యవేక్షితుంటామని వివరించారు.

English summary

An different concept bike taxi service(Baxi)was launched on Monday in Gurgaon. In the first phase, 23 bike taxis are being launched and the service can be used for short distances ranging from 3-5 km