భార్య గురించి క్లింటన్ షాకింగ్ కామెంట్స్

Bill Clinton shocking comments about his wife Hillary Clinton

06:29 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Bill Clinton shocking comments about his wife Hillary Clinton

అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రాట్ల అభ్యర్థిగా ఎట్టకేలకు హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వాన్ని తాజాగా ఖరారు చేశారు. ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఖరారవ్వగా, ఇప్పుడు హిల్లరీ అభ్యర్థిత్వం కూడా తేలిపోయింది. ఇక ఇద్దరి మధ్యా రసవత్తర పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భార్య హిల్లరీ క్లింటన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఆమెను పొగడ్తలతో ముంచేశారు. ఆ విషయం నిజంగా ఆమెపై ఉన్న ప్రేమతోనూ.. అభిమానులతో షేర్ చేసుకోవాల్సిన విషయంగానూ భావించి చెప్పారా లేక ఎన్నికల సమయంలో వారి ఇమేజ్ పెంచుకునే కార్యక్రమంలో భాగంగా చెప్పారా అనేది కాసేపు పక్కన పెడితే.. ఆసక్తిక్రమైన విషయాలే బిల్ క్లింటన్ చెప్పుకొచ్చారు. వారి వ్యక్తిగత విషయాలను సైతం బిల్ క్లింటన్ షేర్ చేసుకున్నారు. 1971 వసంతకాలంలో నేను ఆమెను చూశా. అలా చూసిన క్షణంలోనే ఆమెతో ప్రేమలోపడ్డా. ఆమె నా భార్యే కాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా.

ఆమెకున్న తెలివితేటలు - బలమైన వ్యక్తిత్వం - ప్రేమ నన్ను ఇప్పటికి విస్మయానికి గురిచేస్తుంటుంది. నేను సంపూర్ణమైన జీవితాన్ని ఆమెతో ప్రేమలో పడిన తర్వాతే అనుభవించా. ఒసామా బిన్ లాడెన్ ను గాలించటంలో బరాక్ ఒబామాకు హిల్లరీ ఎప్పుడూ అండగా నిలిచారు. ప్రజాసేవ గురించి నా కళ్లు తెరిపించి ఆదిశగా నన్ను ముందుకు నడిపించిది ఆమెనే అంటూ అదేపనిగా బిల్ క్లింటన్, భార్యపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తనదైన ఎన్నికల ప్రచారంలో దిగిన బిల్ క్లింటన్.. ఆఫ్రికన్ అమెరికన్లు స్వేచ్చగా బయట తిరిగేందుకు హిల్లరీకి అండగా నిలవాలని క్లింటన్ పిలుపునిస్తూ, దేశంలో మార్పు ఆమెతోనే సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చారు. లోపాల్ని సరి చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేయగల గొప్ప మహిళగా హిల్లరీని కీర్తించిన బిల్ క్లింటన్ పుట్టుకతోనే సమాజం పట్ల బాధ్యతను పెంచుకున్న పోరాటవేత్త తన భార్య అని క్లింటన్ చెప్పుకొచ్చారు.

English summary

Bill Clinton shocking comments about his wife Hillary Clinton