ఇండియా కోటీశ్వరుల సొంత విమానాలు

Billionaires with their own flights

06:12 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Billionaires with their own flights

డబ్బుంటే కొండ మీద కోతినైనా దించొచ్చు అనేది పాత సామెత. ఇప్పుడు డబ్బుంటే వేరే గ్రహం లోకైనా వెల్లొచ్చు అనేది కొత్త సామెత. మన ఇండియా అభవృుద్ధి అయిన దేశం కాకపోయినా అభవృుద్ధి చెందుతున్న దేశం అని చెప్పొచ్చు. మన దేశంలో లెక్కలేనంత కోటేశ్వరులు లేకపోయినా, ఉన్న కోటేశ్వరులు దగ్గరే లెక్కలేనంత డబ్బు ఉంది. అందుకే అవి ఏమి చేసుకోవాలో తెలియక విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారు. తమ జల్సాలకి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అత్యంత విలాసవంతమైన ఇల్లు కట్టుకుంటున్నారు, అత్యంత ఖరీదైన వాహనాలు కొనుకుంటున్నారు.

అలా మన దేశంలో వేల కోట్లు డబ్బు ఉన్న కోటేశ్వరులు తమ సొంత వాడుక కోసం ఏకంగా విమానాలు సైతం కొనుకున్నారు. ఒక సాధారణమైన మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు విమానం ఎక్కడమే ఒక గొప్ప విషయంగా చెపుకుంటారు. అలాంటిది ఈ కోటేశ్వరులు ఏకంగా దాన్ని కొనేశారు. మన దేశంలో ఎవరెవరు సొంతంగా విమానాలు కొన్నారో, ఎంత ఖర్చు పెట్టారో చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం చూశేయండి మరి.

1/9 Pages

1. ముకేశ్ అంబాని: విమానం ఖరీదు 496.4 కోట్లు 


ఇండియాలో అత్యంత ధనవంతుడు మరియు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఛైర్మన్ అయిన ముకేశ్ అంబాని కి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లే(1 బిలియన్ డాలర్లు) కాదు అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన 'బోయింగ్ బిజినెస్ జెట్ 2' విమానము కూడా ఉంది. దీని ఖరీదు అక్షరాల 496.4 కోట్లు. దీన్ని పూర్తి విలాసవంతమైన విమానంగా తీర్చి దిద్దారు. ఈ విమానంలో అత్యంత పవర్‌ఫుల్ ఎలెక్ట్రికల్ ఇంజిన్ లు రెండు ఉన్నాయి. ఈ విమానంలో ఒక్కసారి ఇంధనం నింపితే దాదాపు 6616 మైళ్ళ(10,647 కి.మీ.) దూరం వరకు ప్రయాణించగలదు. ఇందులో ఇంటీరియర్ డిజైన్ ని ముకేశ్ అంబానీ నే స్వయంగా ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకున్నారు.

 

English summary

Top Indian Billionaires with their own flights. They bought most expensive flights for their own use. You can see that list by opening this link.