ఈ సెలూన్ ఓనర్  కోటీశ్వరుడు

Billionarie Barber

07:20 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Billionarie Barber

బెంగళూరుకు చెందిన రమేశ్ బాబు సెలూన్ షాప్ ఓనర్ నుండి కోటీశ్వరుడయ్యాడు. రమేశ్ బాబు 7 ఏళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు. ఆయన తాత గారికి ఒక సెలూన్ ఉండేది , కాని తన కుటుంభాన్ని పోషించడానికి అతను ఇంకా చిన్నవాడు కావడంతో అతని తల్లి రమేశ్ ను చదివిం చడానికి నిశ్చయించుకుని ఆ సెలూన్ షాపును రమేశ్ అంకుల్ కు రోజుకు 5 రూపాయలకు అద్దెకి ఇచ్చింది , అతని తల్లి వంట పనులకు వెళ్ళి తన కుటుంభాన్ని పోషించేది .

రమేశ్ ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా పూర్తి చేసే సరికి అతని కుటుంభం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. షాపును అద్దెకి ఇచ్చిన అతను అద్దె చెల్లించానని రమేశ్ తల్లితో గొడవ పడ్డాడు. దీంతో 1991 లో రమేశ్ ఆ సెలూన్ షాపును వెనక్కి తీసుకుని తన క్షౌర వృత్తిని కొనసాగించాడు. ఇది అనతి కాలం లోనే మంచి ప్రజాదరణ పొందింది .

రమేశ్ కు కార్లు అంటే చాల ఇష్టం . ఒకసారి అతని కారు తీసుకు రావడంతో , రమేశ్ ఏమి ఆలోచించకుండా లోన్ తీసుకుని మరీ అతడికి పోటీపడడానికి మారుతీ ఒమ్ని కారును కొన్నాడు. రమేశ్ తాత గారి ఆస్తిని తాకటు పెట్టి పెట్టడంతో నెల వారి వాయిదా గా 6800 రూపాయలను చెల్లించాల్సి వచ్చేది. కారు అలా ఖాళ్ళీ గా ఉండడంతో రమేశ్ తల్లి పని చేసే నందిని అనే ఆమె సూచన మేరకు కారును అద్దెకు ఇచ్చే వ్యాపారాన్ని మొదలు పెట్టాడు . దీంతో రమేశ్ మళ్ళీ వనక్కి తిరిగి చూసుకోలేదు .

ఇలా చిన్న కార్లను అద్దెకు ఇచ్చి వ్యాపారులు బాగా పెరిగిపోవడంతో రమేశ్ చూపు లగ్జరీ కార్ల వైపు మళ్ళింది. 2004 లో 40 లక్షలు పెట్టి ఒక కారును కొనడంతో అందరు పెద్ద రిస్క్ చేసావని అనడంతో నిరాశ చెందలేదు. " వ్యాపారం చెయ్యలనుకుంటే రిస్క్ చెయ్యక తప్పదని " రమేశ్ అంటుంటాడు . 2011 లో రోల్స్ రొయ్స్ కంపెనీ కి చెందిన లగ్జరీ కారును 4 కోట్లు పెట్టి కొన్నాడు . రమేశ్ లగ్జరీ కార్లను అద్దెకు తీసుకున్న వాళ్ళలో నటులు షారుఖ్ ఖాన్ , అమితాబచ్చన్ , ఐశ్వర్య రాయ్ వాళ్ళే కాక అనేక మంది రాజకీయ నాయకులూ ఉన్నారు .

రమేశ్ తన వ్యాపారం నిమిత్తం గడచిన ఏప్రిల్ లో 3 కోట్ల రూపాయలను టాక్స్ కింద చెల్లించాడు. ప్రస్తుతం రమేశ్ కింద 60 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు . అతని మొదటి డ్రైవర్ ఇంకా ఆయన దగ్గర నే పని చేస్తునాడు . రమేశ్ ప్రతిరోజూ 6 గంటలకు లేచి ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు తన సెలూన్ లో పని చేస్తాడు.తరువాత సాయంత్రం 4 గంటల వరకూ కార్ రెంటల్ ఆఫీసు లోను , తిరిగి రాత్రి 7 గంటల వరకు సెలూన్ లోను , మళ్ళీ 7 నుండి రాత్రి 8:30 వరకు కార్ రెంటల్ ఆఫీసులో ఉంటాడు.

ఎక్కువ రద్దీ దృష్ట్యా రమేశ్ ఆదివారం తన సెలూన్ లో మాత్రమే పని చేస్తుంటాడు. రమేశ్ సెలూన్ కు చుట్టూ పక్కల వారి కాకుండా ముంబై , కలకత్తా వంటి నగరాల నుండి కుడా రమేశ్ కు కస్టమర్లు ఉన్నారు.

English summary

Billionarie Barber