బిన్ లాడెన్ బతికే ఉన్నాడట

Bin Laden Not Dead Says Doctor Rohan Gunaratna

11:29 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Bin Laden Not Dead Says Doctor Rohan Gunaratna

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా మట్టుబెట్టినా అతను ఇంకా బతికే ఉన్నాడా? తన అనుచరులకు సందేశాలు పంపుతున్నాడా? ఇటీవల కాలంలో ఆల్ ఖాయిదా వెబ్ సైట్ లో వచ్చిన సందేశాలన్నీ లాడెన్ పెట్టినవేనా? వంటి సందేహాలు వస్తున్నాయి. అయితే లాడెన్ బతికున్నాడని నిపుణులు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. లాడెన్ తనయుడు హమ్జా బిన్ లాడెన్ ఒక ప్రటకన విడుదల చేశాడు. 21 నిముషాల నిడివి ఉన్న ఆడియో టేపును ఆల్ ఖాయిదా విడుదల చేసింది. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హమ్జా హెచ్చరించాడు. అమెరికన్ పాలకులు చేసిన తప్పులకు ఆ దేశ ప్రజలు కూడా జవాబు దారులేనని హమ్జా అన్నాడు. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. నాణానికి మరో వైపు ఇంకో అంశం ఏమంటే, బిన్ లాడెన్ బతికున్నాడనే వాదన.

అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ బతికే ఉన్నాడని ఆల్ ఖైదా వ్యవహారాల నిపుణుడు డాక్టర్ రోహన్ గుణరత్నే అంటున్నాడు. శ్రీలంకకు చెందిన ఆయన అమెరికాలో సెయింట్ ఆండ్రూస్ విశ్వ విద్యాలయంలో ఆచార్యుడుగా పనిచేస్తున్నారు. ఆల్ ఖైదా కార్యకలాపాలపై ఆయన ప్రత్యేక అధ్యయనం చేశారు. ఆల్ ఖైదా వెబ్ సైట్లో గత వారం వచ్చిన ఓ ప్రకటన చూసిన తర్వాత లాడెన్ బతికే ఉన్నాడనిపిస్తోందని రోహన్ గుణరత్నే అభిప్రాయపడ్డారు. ఆల్ ఖైడా వెబ్ సైట్ లో సెప్టెంబర్ 11 దాడులను సమర్థించుకున్నారు. పాశ్చాత్య దేశాలు ఏమనుకున్నా పరవాలేదని తాము అల్లా కోసమే దాడులు చేశామని, అరబిక్ భాషలో ఉన్న ఈ ప్రకటనలో రాశారు. ఇంతటి శక్తిమంతమైన ప్రకటన బిన్ లాడెన్ మాత్రమే చేయగలడని గుణరత్నే అన్నారు. లాడెన్ ఇప్పటికే బ్రిటన్ సహా ఐరోపాలో తమ కేడర్ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారని గుణరత్నే నమ్ముతున్నారు.

ఇక లాడెన్ బతికి ఉన్నాడని తెలిస్తే అల్ ఖైదాలో ప్రస్తుతం ఉన్న నేతలకు కూడా ఇబ్బందిగా ఉంటుందని గుణరత్నే పేర్కొంటూ, అందుకే అత్యంత రహస్యంగా ఉంచి ఉండవచ్చునని వాదిస్తున్నారు. ఇక గత నెల ఒక టీవీలో వచ్చిన లాడెన్ వీడియోను గుణరత్నే గుర్తు చేశారు. అయితే ఇది 2001కి ముందు చిత్రీకరించిన వీడియో అని కూడా అనుమానిస్తున్నారు. అమెరికాపై దాడులకు అల్ ఖైదా ప్లాన్ చేసి ఉండకపోవచ్చునని కొందరు ముస్లింలు నమ్మూతూ వచ్చారు. ఆ దాడులు జరిపింది అల్ ఖైదా అనే అని వాళ్లు కూడా నమ్మకతప్పక పరిస్థితి ఏర్పడిందనేది గుణరత్నే వాదన. ఇకపై తాలిబన్, అల్ ఖైడా కలిసి పోరాడతాయని గుణరత్నే విశ్లేషిస్తున్నారు. లాడెన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడని ఆయన నమ్మకం. అందుకే ఆఫ్ఘన్ లో అమెరికా యుద్ధం ఇప్పుడే ముగిసిపోలేదని ఆయన తేల్చిచెప్పారు.

ఇవి కూడా చదవండి:లేటు వయస్సులో మూడో పెళ్లికి ఇమ్రాన్ సిద్ధం

ఇవి కూడా చదవండి:రష్యన్ హెలికాప్టర్ ఐసిస్ కూల్చేసింది (వీడియో)

English summary

Popular American Doctor Rohan Gunaratna says that Terrorist Osama Bin Laden was still alive and he was doing operation from underground.