శృంగార తార షకీలా రియల్ లైఫ్ తో మరో 'డర్టీ పిక్చర్'

Biopic movie from Shakeela life history

11:00 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Biopic movie from Shakeela life history

షకీలా అని పేరు చెప్పగానే అదో ఫీలింగ్ తో చాలామంది మగాళ్ళు వుంటారు. దానికి కారణం మలయాళం చిత్ర పరిశ్రమ కేంద్రంగా దాదాపు దశాబ్ధంకి పైగా సుదీర్ఘ కాలంపాటు నాలుగైదు రాష్ట్రాల కుర్రకారుని తన మత్తులో కట్టిపడేసింది. హాట్ లేడీ షకీలా సౌతిండియాని ఓ ఊపు ఊపేయ్యడమే కాదు, ఒకానొక దశలో తన బీ గ్రేడ్ సినిమాలతోనే టాప్ హీరోయిన్లకి పోటీనిచ్చింది. షకీలా సినిమా రిలీజ్ డేట్ నుంచి రెమ్యునరేషన్ వరకు ఆమెకి సంబంధించిన ప్రతీది ఓ టాక్ ఆఫ్ ది టౌనే. అటువంటి షకీలా ఆ తర్వాతి కాలంలో తన జీవితంలోనే అతి క్లిష్టమైన స్టేజ్ కూడా ఎదుర్కొంది.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన షకీలా చేతిలో ఎందరో ప్రముఖుల జాతకాలు సైతం వున్నాయనే టాక్ నడిచింది. ఇప్పుడామె రియల్ స్టోరీ ఆధారంగానే ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందనే టాక్ వినిపిస్తోంది. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ ఇప్పటికే షకీలా లైఫ్ ఆధారంగా ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం.. ఆమె పాత్రకోసం బాలీవుడ్ నటి హుమా ఖురేషీని సంప్రదించినట్టు వార్తలొస్తున్నాయి. వాస్తవానికి షకీలా బయోపిక్ వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఓ ఏడాది, రెండేళ్ల క్రితం కూడా షకీలా బయోపిక్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

కానీ ఎందుకో ఆ టాపిక్ అంతటితోనే సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకి అదే కాంబినేషన్ లో షకీలా బయోపిక్ తెరపైకొచ్చింది. విచిత్రం ఏంటంటే.. గతంలో సిల్క్ స్మిత రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ ని తెరకెక్కించిన దర్శకుడు తెలుగు వారు కాదు.. అలాగే ఇప్పుడీ మలయాళం మల్లు బ్యూటీ సినిమా తెరకెక్కించేందుకు ముందుకు వచ్చిన దర్శకుడు కూడా మలయాళం వారు కాదు. కానీ ఆ రెండింటి మధ్య ఓ కామన్ పోలిక ఏంటంటే... అప్పుడు డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మిత రోల్ ప్లే చేసిన విద్యాబాలన్ ఓ బాలీవుడ్ నటే. ఇక ఇప్పుడు షకీలా రోల్ కి సైన్ చేసినట్టుగా వినిపిస్తున్న హుమా ఖురేషి కూడా బాలీవుడ్ నటే. మొత్తానికి హాట్ షకీలా రియల్ లైఫ్ ఆధారంగా రూపొందే ఈ చిత్రంతో మరోసారి షకీలా పేరు మారుమోగనుంది.

English summary

Biopic movie from Shakeela life history