గంటన్నరకు కోటిన్నర పట్టేసిన బిపాసా?

Bipasha Basu Charged One And Half Crore for Yoga Event

11:39 AM ON 24th June, 2016 By Mirchi Vilas

Bipasha Basu Charged One And Half Crore for Yoga Event

యోగా పేరిట ధనయోగం సిద్ధిస్తుందని ఈ భామ నిరూపించిందా? అంటే అవుననే విధంగా ఈ సంఘటన ఉంది. ఇంతకీ విషయం ఏమంటే, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగుళూరులో నిర్వహించిన శిబిరంలో గంటన్నర పాటు యోగాలో పాల్గొన్న బాలీవుడ్ నటి బిపాసా బసుకు సిద్ధ రామయ్య ప్రభుత్వం కోటిన్నర రూపాయలు చెల్లించింది. దీని పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ముంబై నుంచి ఆమె బెంగుళూరుకు రాకపోకలు, బెంగుళూరులో ఆమె బస కోసం మరి కొంత సొమ్ము కూడా ఖర్చు చేశారట. భారతీయ సంస్కృతికి అద్దంపట్టే యోగాకు బిపాసాను పిలవడమేమిటని శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ ప్రశ్నించారు. ఈ షో కు మరింతమంది జనాన్ని రప్పించేందుకు సన్నీ లియోన్ ని రప్పించాల్సిందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ఏమైనా ఓ గంటన్నర ప్రోగ్రాముకి కోటిన్నర పట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:సినిమా చూపిస్తా మావా అంటున్న అనుష్క

ఇవి కూడా చదవండి:బాయ్ ఫ్రెండ్ కావాలని కలవరిస్తున్న హీరోయిన్

English summary

Bollywood Beauty Bipasha Basu charged One And Half Crore Rupees for yoga event in Begaluru which was held On Yoga Day.