ఈ బామ్మ ఆనందానికి అవద్దుల్లేవ్.. శతాధిక వృద్ధురాలికి బర్త్ డే సెలెబ్రేషన్స్

Birthday celebrations for 105 years old lady

10:56 AM ON 5th August, 2016 By Mirchi Vilas

Birthday celebrations for 105 years old lady

అవును, వృద్ధాశ్రమంలో ఉంటున్న 105 ఏళ్ల ఓ బామ్మ జన్మదిన వేడుకలను స్థానిక నాయకులు, వృద్ధాశ్రమంలో ఉంటున్న మహిళా సేవాసమితి సభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తిరుమలేష్, సుధాకర్, సంపత్ కుమార్, అంజి, సురేందర్, శ్రీధర్, వృద్ధాశ్రమ సభ్యులు అరుణసాహా, మీనముత, అన్సాసావిద్య పాల్గొన్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ జైన్మందిర్ వృద్ధాశ్రమంలో 105 ఏళ్ల అను షాబాయ్ అనే బామ్మ 12 ఏళ్లుగా ఆశ్రమంలో నివసిస్తోంది. బామ్మ జన్మదినం విషయాన్ని తెలుసుకున్న స్థానిక నాయకులు, వృద్ధాశ్రమంలో నివసించే మహిళా సేవాసమితి సభ్యులు బామ్మతో కేక్ కట్ చేయించి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆ బామ్మ ఆనందానికి అవద్దుల్లేవ్.

English summary

Birthday celebrations for 105 years old lady