బిర్యానీ బాబా గురించి వింటే షాక్ అవ్వాల్సిందే

Biryani Baba Who Feeds 1 crore People over 40 years

01:12 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Biryani Baba Who Feeds 1 crore People over 40 years

ఈ నవీన కాలంలో మన రోజువారీ జీవితం లో నిత్యం రకరకాల బాబాల గురించి వింటూ ఉంటాం. చాలామందిని చూస్తుంటాం. ఇందులో మహిమలు వుండే బాబాలు కొందరైతే , మహిమలు వున్నట్లు భ్రమింపజేసి, మన దగ్గర వున్నది కాజీసే వాళ్ళు మరికొందరు. కానీ బిర్యానీ బాబా వెరైటీ.. ఓహో బిర్యానీ బాబా అంటే ఆయనకు బిర్యానీ ఇస్తే మనకి అవసరమైన పని చేస్తాడని భావిస్తే, అంతకన్నా తప్పు మరొకటి వుండదు.

విషయం ఏమంటే, బిర్యానీ మనకే పెట్టిస్తాడు. అవును 79 ఏళ్ల వయసు ఉన్నా ఈయన పేరు అత్తవుల్లా షరీఫ్ షతాజ్ ఖాదిరి బాబా అలియాస్ బిర్యానీ బాబా 40 సంవత్సరలుగా తన దగ్గరకు వచ్చినవారికి బిర్యానీ పెడుతున్నాడు. ఈయనది ఆంధ్రప్రదేశ్ రాష్రం లోని కృష్ణా జిల్లా... ఈయన 40 ఏళ్ల క్రితం మరణించిన తన గురువు ఖాదర్ బాబా వారసత్వాన్ని ఇప్పటికి కొనసాగిస్తున్నాడు. నాదేముంది? ఆకలితో ఉన్నవారికి, అవసరమున్నవారికి భోజనం పెడుతున్నా. అంతే కదా, దానికి భక్తులు, దాతలు విరాళాలిస్తున్నారు అని చెప్పడం విశేషం. చీమలపాడు దర్గాలోని లంగర్ ఖానాలో ఒక్క మతమని కులమని ఏమీ లేదు, ఎవరొచ్చినా కడుపు నిండా బిర్యానీ పెట్టడమే తన జీవిత ధ్యేయమంటాడు . మానవసేవే దేవుడి సేవ అని నమ్ముతా, ఆకలికి కులాలు, మతాలు లేవు , ఎవరైనా ఒకటే, నేను జనానికి కూడా చెప్పేది ఒకటే , పేదల పట్ల ప్రేమను కలిగి ఉండండి అని బాబా చెబుతున్నాడు.

ఈ బిర్యానీ బాబా ఆశీస్సుల కోసం రోజు దాదాపు వెయ్యి, మంది దాకా వస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏకంగా 10 వేల మంది వరకు వస్తారు. బిర్యానీ చేయటం కోసం సగటున రోజూ రెండు టన్నుల బాస్మతి బియ్యం, క్వింటాళ్ల కొద్దీ చికెన్, మటన్, నెయ్యి అవసరమవుతాయి , కేవలం శాఖాహారమే తినాలి అనుకునే వారికోసం వేరుగా వంట చేస్తారు. దాదాపు 40 ఏళ్లగా కోటి మందికి బిర్యానీ పెట్టి మరీ ఆకలి తీర్చడం ఈ బిర్యానీ బాబా స్పెషాలిటీ ... అదండీ సంగతి.

ఇవి కూడా చదవండి: అక్కడ సొట్టలుంటే శృంగార సామ్రాట్టులా

ఇవి కూడా చదవండి: 98 రూపాయలకే 850 ఎకరాలు లీజ్ కు ఇస్తున్నారు!

ఇవి కూడా చదవండి: రోజంతా ఎండలో ఉంచాడని ఓనర్ తల కొరికి చంపేసిన ఒంటె

English summary

A Baba named Biriyiani Baba was feeding people with Biriyani over forty long years. He used to feed people who was hungry with Biriyani and up to now he feed 1 crore people with Biriyani. He also serves people who do not eat non-vegetarian .