టిఆర్ఎస్ లోకి దూకేశారు 

BJP Ex-MLA Joined In TRS

01:15 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

BJP Ex-MLA Joined In TRS

ఇప్పటికే టిడిపి , బిజెపి , కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు అధికార టిఆర్ఎస్ లో చేరిపోగా, గ్రేటర్ ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, శేరిలింగంపల్లి టిడిపి నేత బండి రమేశ్‌ తదితరులు టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టిఆర్ఎస్ నేతలు వారికి సాదర స్వాగతం పలికారు.

English summary

BJP Ex-MLA Prem Singh Rathode and Serlingampally TDP Leader Bandi Ramesh were joined in TRS Party.