బిజెపి ని మళ్ళీ టార్గెట్ చేస్తూ శివాజీ కొత్త నినాదం

BJP Hatao AP Bachao Hero Shivaji

12:58 PM ON 24th May, 2016 By Mirchi Vilas

BJP Hatao AP Bachao Hero Shivaji

అవును ఈ మధ్య ఎపికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఉద్యమం సాగిస్తూ బిజెపి నేతలపై మండిపడుతున్న హీరో శివాజీ మరోసారి గళం ఎత్తాడు. ఈ సారి ఏకంగా "బీజేపీ హఠావో.. ఏపీ బచావో" అంటూ, కొత్త నినాదం ఎత్తుకున్నాడు. సరిగ్గా రెండేళ్ల కిందట జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ‘‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి తెచ్చిన నినాదమిది. దాని స్ఫూర్తితో ఇప్పుడు హీరో శివాజీ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ.. ‘బీజేపీ హఠావో.. ఏపీ బచావో’ అనే నినాదాన్నిచ్చాడు. గత ఎన్నికల సందర్భంగా శివాజీ భాజపా తీర్థం పుచ్చుకోవడం.. ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేయడం వంటి లాంచనాలు పూర్తిచేసి ఆ తర్వాత కొద్ది నెలలకే తిరగబడ్డాడు.

ఇవి కూడా చదవండి:చందమామ కావాలా అయితే సిద్ధం ...

ఎన్నికల అనంతరం మోడీ సర్కారు ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయకుండా వదిలేయడం పై శివాజీ పోరాటం మొదలుపెట్టాడు. ప్రత్యేక హోదా కోరుతూ దీక్షలు చేశాడు..ఆందోళనల్లో పాల్గొన్నాడు. తాజాగా బిజెపి మీద ఉద్యమానికి సిద్ధమైపోయాడు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పెట్టినపుడు ఇచ్చిన హామీలన్నింటినీ బిజెపి తుంగలోకి తొక్కిందని ఆరోపించాడు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన బిజెపి నేతలు రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ఏపీని అడుక్కునే రాష్ట్రంగా మార్చారని.. వారి భార్యలు వారికి ఇంట్లో భోజనం కూడా పెట్టకూడదని శివాజీ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. కేంద్ర మంత్రులు.. బిజెపి నేతలు రాష్ట్రానికి వచ్చినపుడు వారిని అడ్డుకుని నిలదీయాలని శివాజీ పిలుపునిచ్చాడు. ప్రత్యేక హోదా కోసం మున్ముందు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టబోతున్నట్లు శివాజీ ప్రకటించాడు. మొత్తానికి శివాజీ పిలుపు ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:ఐపీఎల్ గురించి మీకు తెలియని విషయాలు

ఇవి కూడా చదవండి:హామీల అమలుకు 'అమ్మ' కసరత్తు

English summary

Hero Shivaji who supported BJP at the time of elections in 2014 was opposed later for not giving special status for Andhra Pradesh. He said that "BJP Hatao AP Bachao". He announced that he was going to do protests if BJP government didn't respond on Special Status To Andhra Pradesh.