ఆయన నాలుక కోసి తెస్తే రూ కోటి ఇస్తా

BJP Leader Offers 1 Crore For Owaisi Tongue

05:01 PM ON 17th March, 2016 By Mirchi Vilas

BJP Leader Offers 1 Crore For Owaisi Tongue

గొంతు మీద కత్తి పెట్టినా సరే ‘భారత్‌ మాతాకీ జై’ అనను గాక అననంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇంకా దుమారం సాగుతోంది. దేశవ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి నేత శ్యామ్‌ ప్రకాశ్‌ ద్వివేది తాజాగా ఒవైసీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన నాలుక కోసి తెచ్చిన వారికి రూ.కోటి రివార్డుగా ఇస్తానంటూ ప్రకటించి, మరో వివాదానికి తెరలేపారు. అంతటితో ఆగలేదు, ఒవైసీ ఓ ఉగ్రవాదని, ఆయనకు ఈ దేశంలో నివసించే హక్కు లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

21వేలు రివార్డు ప్రకటించిన విద్యార్ధి ....

ఒవైసీ వ్యాఖ్యలపై రోజుకో రీతిన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నాలుకో కోసిన వారికి రూ.21వేలు రివార్డు ఇస్తానని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి సంఘ నేత వ్యాఖ్యలు చేసాడు. ఈ ప్రకటన్ నేపధ్యంలో మరుసటి రోజే తాను రూ.కోటి స్తానంటూ బిజెపి నేత స్పందించారు.

పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న శివసేన

ఇక ఎంఐఎం నేత ఒవైసీ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందిస్తూ, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో సంపాదకీయం ప్రచురించింది. ఒవైసీకి దేశంలో జీవించే హక్కు లేదని, ఆయన ఓటు హక్కునూ రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది.

మెడపైన కత్తి పెట్టినా.. భారత్ మాతా కీ జై అనేది లేదు

ఈసారి మహేష్ తో కల్సి వస్తానన్న నమ్రత

పది కోట్లు ఇవ్వలేదని శవంగా మార్చారు

English summary

BJP Leader Shyam Praklash Dwivedi offers 1 crore rupees on MIM Party leader Asaduddin Owaisi for speaking controversial words.In uttar pradesh ABVP leader offers 21 thousand for Asaduddin tongue and Shivasena Demanded to cancel his Citizenship in India.