ఆ పాటకు చిందులేస్తూ, నోట్ల వర్షం కురిపిస్తూ... బీజేపీ నేత ఏం చేశాడో తెలుసా?

BJP Leader Throws New 2000 Rupee Notes On A Dancer In Madhya Pradesh

11:33 AM ON 14th December, 2016 By Mirchi Vilas

BJP Leader Throws New 2000 Rupee Notes On A Dancer In Madhya Pradesh

పెద్ద నోట్ల రద్దుతో జనం కరెన్సీ కోసం బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రోజులు గడుస్తున్నా సేమ్ సీన్ రిపీట్ అవుతూనే వుంది. ఎప్పటికి పరిస్థితి మారుతుందో చెప్పలేని స్థితి నెలకొంది. అయితే రోజూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో బయటపడుతున్న కోట్ల రూపాయల కొత్త నోట్లు సామాన్యుడి ఆగ్రహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. కొత్త నోట్లు పక్క దారి పట్టడంపై బ్యాంకులపై, కేంద్రంపై ప్రజలు మండిపడుతున్నారు. డబ్బు కోసం జనం ఇలా నానా పాట్లు పడుతుంటే మధ్యప్రదేశ్ కు చెందిన ఈ బీజేపీ నేత మాత్రం డ్యాన్సర్ పై నోట్ల వర్షం కురిపిస్తున్నాడు. కజ్ రారే పాటకు డ్యాన్సర్ తో కలిసి చిందులేస్తూ నోట్లను ఆమెపై వెదజల్లాడు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించడం గమనించిన సదరు బీజేపీ నేత వీడియో తీయడం ఆపాలని బెదిరించాడు. అయితే అప్పటికే ఆయన గారి బాగోతమంతా రికార్డయింది. మధ్య ప్రదేశ్ లోని ధర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఆ బీజేపీ నేత జిల్లా పంచాయితీ వైస్ ప్రెసిడెంట్ కల్యాణ్ పటేల్ గా తెలిసింది. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు సదరు నేతపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంకు అధికారి అరెస్ట్

ఇవి కూడా చదవండి: వావ్... రూ. 2000 నోట్లతో హీరోయిన్ డ్రస్

English summary

Madhya Pradesh BJP leader named Kalyan Patel was in trouble because he used to throw new 2000 rupee notes on a dancer and the whole thing was recorded in camera and now this gone viral in social media.