దావూద్ కాల్స్ అందుకున్న మంత్రి రిజైన్?

BJP minister Eknath khadse resigns

12:53 PM ON 4th June, 2016 By Mirchi Vilas

BJP minister Eknath khadse resigns

మహారాష్ట్ర లో సంచలనం సృష్టించిన దావూద్ ఇబ్రహీం కాల్స్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. దీంతో పాటు పుణే భూ వ్యవహారాల ఆరోపణలు కూడా చుట్టుముట్టడంతో మహారాష్ట్ర బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సే రెవిన్యూ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భూములను నల్లధనంతో అతి తక్కువ ధరకు కొన్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన రాజీనామా చేసినట్లు అధికారిక ఎలాంటి ప్రకటన లేనప్పటికీ, రిజైన్ చేసినల్టు వార్తలు పోక్కాయి.

ఏక్నాథ్ ఖడ్సే వ్యవహారంపై ముఖ్యమంత్రి ఫడ్నవిస్ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోనూ చర్చించారట. ఈ నేపథ్యంలోనే పదవి నుంచి తప్పుకోవాలని ఖడ్సే నిర్ణయించుకున్నారని భావిస్తున్నారు. ఏక్నాథ్ ఖడ్సే మహారాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. పుణేలో భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు, కరాచీలో ఉంటున్న దావూద్ ఇబ్రహీం ఇంటి నుంచి ఆయనకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనకు బీజేపీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని, తాను పార్టీకి విధేయుడినని, పార్టీ ఇచ్చే ఆదేశాలను పాటిస్తాన ని మంత్రి ఏక్నాథ్ ఖడ్సే చెప్పారు.

ఇది కూడా చూడండి:తుది శ్వాస విడిచిన బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ

ఇది కూడా చూడండి:అక్కడ గాడిదలకు డైపర్స్ తప్పనిసరి

ఇది కూడా చూడండి:విష్ణు హీరోగా 'అసెంబ్లీ రౌడీ' రీమేక్

English summary

BJP leader Eknath khadse seems to have resigned as Minister of Revenue.