విద్యార్ధులపై అహూజా మళ్ళీ సంచలన వ్యాఖ్యలు

BJP MLA Ahuja Controversial Words On JNU students

05:06 PM ON 26th February, 2016 By Mirchi Vilas

BJP MLA Ahuja Controversial Words On JNU students

ఇప్పటికే ఓ సారి సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదుడైన రాజస్థాన్‌కు చెందిన బెజిపి ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ అహూజా మరోసారి జేఎన్‌యూ విద్యార్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో జరిగే 50 శాతం అత్యాచారాలకు వారే కారణమని ఆరోపించారు. మూడు రోజుల క్రితం జేఎన్‌యూకి వ్యతిరేకంగా జరిగిన ఓ నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ.' జేఎన్‌యూ క్యాంపస్‌లో రోజూ వేల సంఖ్యలో మందు బాటిళ్లు, సిగరెట్‌ పీకలు, కండోమ్‌లు.. తదితరాలు కనిపిస్తాయి పార్టీల పేరుతో అక్కడ యువత నగ్నంగా నృత్యాలు చేస్తారు' అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో బిజెపి అధిష్ఠానం ఆయన్ని వివరణ కోరింది. అయినా ఆయన మళ్లీ శుక్రవారం కూడా ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దాంతో సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు హల్ చల్ చేస్తున్నాయి.

English summary

BJP MLA Gyan Dev Ahuja from Rajasthan who has earned ridicule for suggesting the Jawaharlal Nehru University (JNU) was a sex den, said on Thursday that 50% of the cases of rape incidents in New Delhi were committed by the students of the institute.Due this contreversial words BJP party had asked him Description on his words.