బీఫ్ ఫెస్టివల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు

BJP MLA Booked For His Contreversial Words On Beef Festival

07:01 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

BJP MLA Booked For His Contreversial Words On Beef Festival

హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ లో బీఫ్ ఫెస్టివల్ పై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వెలువడుతున్న సమయం లో హైదరాబాద్ బీజేపీ ఎంఎల్ఏ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బిజెపి ఎంఎల్ఎ రాజా సింగ్ పై కేసు నమోదు చేసారు. కొందరు వామపక్ష విద్యార్ధి సంఘాలకు చెందిన ప్రతినిధులు గోషామహల్ ఎంఎల్ఎ రాజా సింగ్ పై పోలీసుల కు ఫిర్యాదు చేసారు. ఎంఎల్ఎ మాటలు ఒక సంఘం వారిని అగౌరవపరుస్తూ వారిని రెచ్చగొట్టే లా ఉన్నాయని పోలీస్ అధికారి అశోక్ రెడ్డి అన్నారు. రాజా సింగ్ పై ఐపిసి సెక్షన్ 505 ప్రకారం కేసు నమోదు చేశామని అన్నారు. పోలీసులు విద్యార్ధుల వాంగ్మూలాలను రికార్డు చేసి విచారణ జరుపుతామని తెలిపారు. డిసెంబర్ 10న జరగబోయే "బీఫ్ ఫెస్టివల్ "ను ఎట్టి పరిస్థితులలోను తప్పక జరిపి తీరుతామని ఉస్మానియా విద్యార్ది సంఘం నేతలు స్పష్టం చేసారు.

English summary

BJP MLA Raja Singh was booked in a case for his contreversial words on beef festival which was going to be held in osmania university (ou)campus in hyderabad