శక్తిమాన్‌ను కొట్టిన ఎమ్మెల్యేకు కస్టడీ

BJP MLA Ganesh Joshi arrested for Beating Horse Named Shaktimaan

10:17 AM ON 19th March, 2016 By Mirchi Vilas

BJP MLA Ganesh Joshi arrested for Beating Horse Named Shaktimaan

ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన ఆందోళనలో శక్తిమాన్‌ అనే పోలీసు గుర్రాన్ని కొట్టిన బిజెపి ఎమ్మెల్యే గణేశ్‌ జోషికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ముస్సోరి ఎమ్మెల్యే గణేశ్‌ జోషిని పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేయగా , కాగా బిజెపి కార్యకర్త ప్రదీప్‌ బోరాను గురవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో బిజెపి నిర్వహిస్తున్న ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు గుర్రాలపై వచ్చారు. బిజెపి ఎమ్మెల్యే గణేశ్‌ జోషి అక్కడ ఉన్న శక్తిమాన్‌ అనే 13ఏళ్ల గుర్రం కాళ్లపై విపరీతంగా కొట్టడంతో ఒక కాలు విరిగి పోయింది. దీంతో పదిమంది వైద్యుల బృందం గుర్రానికి శస్త్రచికిత్స చేసి కాలు కింది భాగం తొలగించి కృత్రిమ కాలును అమర్చారు. గుర్రాన్ని కొట్టడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చెన్నై చంద్రం త్రిష కూడా దీనిపై స్పందిస్తూ ఎంఎల్ఏ వైఖరిని తప్పు బట్టిన సంగతి తెల్సిందే. అయితే ఎమ్మెల్యే కుమార్తె నేహా జోషి మాట్లాడుతూ... వార్తా ఛానల్స్‌ ఈ ఘటనను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు.

English summary

BJP MLA Ganesh Joshi was today arrested and sent to 14-day judicial custody by a court here for allegedly assaulting and causing injuries to police horse 'Shaktiman' during a protest march which led to amputation of one of its hind legs.