రూ.5కోట్ల విలువైన కారు గిఫ్ట్ ఇస్తే .. ఆపై... (వీడియో )

BJP MLA Gifts Wife Rs 5 Crore Orange Lamborghini Sports Car

11:19 AM ON 31st August, 2016 By Mirchi Vilas

BJP MLA Gifts Wife Rs 5 Crore Orange Lamborghini Sports Car

భార్య పుట్టినరోజు అంటే సరదాగా ఎదో గిఫ్ట్ ఇస్తుంటారు. కానీ ఓ ఎం ఎల్ ఏ తన భార్యకు పుట్టిన రోజు కానుకగా కారు ఇచ్చాడు. అది 5 కోట్ల రూపాయల విలువైనది. ముంబైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెమతా రూ.5కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన లంగోర్గిని స్పోర్ట్స్ కారును భార్యకు బహుమానంగా ఇచ్చారు. భర్త ముచ్చటపడి ఇచ్చిన ఆ కారుతో ఆమె డ్రైవ్ చేసుకుంటూ షికారుకెళ్లి ఓ ఆటోకు డాష్ ఇచ్చేసింది. అయితే అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ప్రమాదాన్ని ముందే ఊహించిన పాదచారులు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మీరా-భయందర్ రోడ్డులో జరిగిన ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తన భార్యకు కార్లు నడపడంలో విశేష అనుభవముందని, 18 ఏళ్లుగా ఆమె వివిధ రకాల కార్లు నడిపిందని చెప్పారు. ఇది పెద్ద ప్రమాదమేమీ కాదని, ఓ ఆటోను నెమ్మదిగా ఢీకొందని చెప్పుకొచ్చారు. ఆటోకు జరిగిన నష్టానికి డబ్బులు చెల్లించినట్టు తెలిపారు. కాగా ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.

ఇది కూడా చూడండి: ఎయిర్‌ హోస్టెస్‌ ని వేధించిన క్యాబ్ డ్రైవర్

ఇది కూడా చూడండి: మెగాకు కిక్కెక్కిస్తున్న తమన్నా ఐటెం ..

English summary

BJP MLA Narendra mehta gave a gift to his wife. The gift is Rs 5 crore luxurious orange Lamborghini sports car. But unfortunately she rams it into auto.