నోట్ల రద్దుపై బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

BJP mla shocking comments on notes bann

11:58 AM ON 18th November, 2016 By Mirchi Vilas

BJP mla shocking comments on notes bann

పెద్ద నోట్ల రద్దుపై అదానీ, అంబానీలకు ముందే తెలుసంటూ రాజస్థాన్ బిజెపి ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్ ప్రకటించి కలకలం రేపారు. కోటలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో పిచ్చాపాటీ మాట్లాడుతూ భవానీ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన తాను అలా మాట్లాడలేదని చెప్పారు. దీనికి సంబంధించి చూపుతోన్న వీడియోలో గొంతు తనది కాదన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం బిజెపిపై విరుచుకుపడుతున్నాయి. నోట్ల రద్దు రహస్యంగా జరిగిందని ప్రభుత్వం చెప్పడం అబద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే బిజెపి అధిష్టానం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.

English summary

BJP mla shocking comments on notes bann