ఆ ఎంపీ బతికున్నా...  చంపేసిన వికీపీడియా 

BJP MP Anju Bala is still alive but in Wikipedia she was died

11:06 AM ON 10th March, 2016 By Mirchi Vilas

BJP MP Anju Bala is still alive but in Wikipedia she was died

బతికున్నా సరే చనిపోయినట్లు వార్తలు ఇచ్చేయడం ఆ తరువాత పొరపాటుకు చింతిస్తున్నాం అంటూ సర్దుకోవడం అప్పుడప్పుడు జరుగుతూ వుంటాయి. కానీ ఇదో విచిత్ర స్థితి... ఆమె ఓ ఎంపీ. కానీ.. ఆమె బతికున్నా సరే లేనట్టు ఓ సమస్య రావడంతో లబోదిబోమంటూ సాక్షాత్తూ పార్లమెంటులోనే ఆమె తన గోడును వెళ్లబోసుకుంది. ఆమె ఎదుర్కొంటున్న సమస్య విన్న ఎంపీలంతా విస్మయం చెందుతూ, ఇలాంటి స్థితి ఎవరికీ రాకూడదని అనుకున్నారు. ఇంతకీ ఈ సమస్య అధికార బీజేపీ ఎంపీ అంజుబాలకు ఎదురైంది. ఆ సమస్య ఏమంటే, ఆమె గురించి వికిపీడియాలో ఉన్న పేజీలో ఆమె చనిపోయినట్లు ఉందట.

ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యను ఆమె ప్రస్తావిస్తూ, తాను చనిపోయినట్లుగా వికీపీడియాలో ఉందని.. ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే తనకు సిగ్గుగా ఉందని అన్నారు. తన మరణం గురించి ఫోన్ కాల్స్ తన సెక్రటరీకి వస్తున్నాయని ఆమె ఆవేదన చెందారు. తాను ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఏమిటని ఆమె సూటిగా ప్రశ్నించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయాన్ని కేంద్రన్యాయమంత్రి సదానందగౌడ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి సదానంద స్పందిస్తూ, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని.. సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామన్నారు.

ఒక ఎంపీకి సంబంధించి వికీపీడియాలో తప్పుడు సమాచారం అందించటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని.. దీని పై చర్యలు తప్పవని తేల్చి చెప్పిన కేంద్రమంత్రి సదానంద ఎలాంటి చర్యలు తీసుకుంటారో, మరి వికిపీడీయా వాళ్ళు ఎలా స్పందిస్తారోనని ఆతృత నెలకొంది.

English summary

BJP MP Anju Bala is still alive but in Wikipedia she was died.