నిరసనగా గుర్రమెక్కిన ఎంపీ

BJP MP Riding Horse In Delhi

10:36 AM ON 28th April, 2016 By Mirchi Vilas

BJP MP Riding Horse In Delhi

సర్దార్ లో చెక్క గుర్ర్రం ఎక్కి పవర్ స్టార్ పవన్ అలరించిన సంగతి తెల్సిందే. కానీ ఓ ఎంపి నిజంగా గుర్రం ఎక్కి తన నిరసన వినూత్నంగా తెల్పాడు. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న సరిచేసి ట్రాఫిక్ రూల్ ని బిజెపి ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆపార్టీ ఎంపీ.. రాం ప్రసాద్ శర్మ వెరైటీగా బుధవారం గుర్రమెక్కి పార్లమెంటు సమావేశాలకు వచ్చారు. కాలుష్య రహిత వాహనం అని ఇంగ్లీషులో రాసి ఉన్న బోర్డును ఆ గుర్రానికి తగిలించారు. 'ఆప్' ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడలకు పాల్పడుతోందని. సరి-బేసి నిబంధన ఉల్లంఘించిన వారికి 2 వేల రూపాయల జరిమానా విధించడం అన్యాయమని, దీన్ని తగ్గించాలని బిజెపి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రజలను ఆకర్చించడానికి వేసే ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కాదయా ..

ఇవి కూడా చదవండి:యాక్టింగ్ కోసం ట్రై చేసి బెగ్గర్ అవతారం...

ఇవి కూడా చదవండి:రాయలసీమకు చిత్ర పరిశ్రమ

ఇవి కూడా చదవండి:విమానం టాయ్ లెట్ లో 7కేజీల బంగారం!!

English summary

Delhi BJP MP done a different protest in Delhi. He ride a horse on Delhi roads by opposing the new rule passed by Delhi Aravind Kejriwal Government . He ride horse by saying that it was a non-polluting vehicle.