అమీర్ వ్యాఖ్యల పై స్పందించిన బిజేపి

BJP Responds To Amir's Words

05:07 PM ON 24th November, 2015 By Mirchi Vilas

BJP Responds To Amir's Words

భారత్ లో ఆసహనం పెరిగి పోతోందంటూ తన భార్య భారత్ వదిలి వెళ్ళిపోదాం అని చెప్పిందంటు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలకు బిజేపి స్పందించింది.

బిజేపి నేత నళిన్ కోహ్లి మాట్లాడుతూ దేశంలో ఉండాలో విడిచి వెళ్ళాలో తేల్చుకోవడం వారి వ్యక్తిగత విషయమని.. భారత్ ఇప్పుడు ఎప్పుడు ఓర్పు సహనం గల దేశమని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలోని ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మాత్రమే దేశంలో అసహనం నెలకొందనీ,అప్పుడు ప్రజలు తమ భావాలను స్వతంత్రంగా వ్యక్తం చెయ్యలేక పోయేవారని అయన అన్నారు. ఆ తరువాతి రోజుల్లో అలాంటి పరిస్థితి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

మొత్తానికి దేశాన్ని వదిలి వెళ్ళాళనుకుంటె అది వారి వ్యక్తిగత వ్యవహారమని దేశం లో పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన అన్నారు.

English summary

BJP leader Nallin Kohli responds to Bollywood actor Amir khan words about intolerance in india.Nalin Kohli Says INdia is always a toleratable country.He says Who wants to leave country is their personnal choice