ఎవరికి వారే దారి చూసుకుంటున్నారా ?

BJP To Contest Individually In 2019 Elections

12:26 PM ON 21st April, 2016 By Mirchi Vilas

BJP To Contest Individually In 2019 Elections

ఎపిలో కమల నాధులు సొంతంగా ఎదగాలని అనుకుంటున్నారట. అందుకే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిపోరుకు సిద్ధమవుతోందా? అంటే ముమ్మాటికీ అవునని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాదు ఇప్పటినుంచే క్యాడర్ ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన కృష్ణాజిల్లా బీజేపీ నేతల సమావేశం గడిచిన ఎన్నికల్లో ఇరుపార్టీలు పోటీ చేసినా, వచ్చే ఎన్నికల నాటికి ఆ పరిస్థితి వుండకపోవచ్చంటూ కీలక నేతలు వ్యాఖ్యానించారట . గతంలోకంటే బీజేపీ పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగుపడిందని, దిగువస్థాయి క్యాడర్ బాగానే బలోపేతం అయ్యిందని నేతలు చర్చించుకోవడం కనిపించింది.

ఇవి కూడా చదవండి :చిరుకు షాకిచ్చిన ఉపాసన

ఈ క్రమంలో వచ్చేఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధంకావాలని సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. చాలా కమిటీల్లో తమకు చోటు ఇవ్వలేదని దిగువస్థాయి క్యాడర్ ఈ భేటీలో ప్రస్తావించారట. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు అదే స్థాయిలో రియాక్ట్ అయినట్టు సమాచారం. బీజేపీకి ఆల్ ద బెస్ట్ చెబుతూనే, 2019 వరకు ఆగాల్సిన అవసరం లేదని, వీలైతే ముందుగా వెళ్తే మంచిదంటూ సెటైర్లు వేస్తున్నారట. ఇప్పటికే టీడీపీ-బీజేపీల మధ్య కలహాల కాపురం అంతంత మాత్రంగానే సాగుతోంది. చాలా వేదికలపై ఇరు పార్టీలు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శించుకున్న దాఖలాలు లేకపోలేదు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఇరుపార్టీలు వేటికవే ఒంటరిగానే పోటీ చేయబోతున్నాయన్నమాట. మొత్తానికి బిజెపి - టిడిపి బంధం అనుకోని పరిస్థితులకు దారితీస్తోంది. ముసుగులో గుద్దులాట ఎందుకు ఎవరి బలమేమిటో తీల్చుకుంటే పోలే ?

ఇవి కూడా చదవండి :

'సర్దార్' చిత్రం పై దాసరి షాకింగ్ కామెంట్స్

మూఢనమ్మకాలు వాటి వెనుక లాజిక్

కూతుర్ని రేప్ చేసాడని ఆ కామాంధుడు చేతులు నరికేసిన తండ్రి

English summary

Bharateeya Janata Party was going to be contest individually in upcoming elections in 2019. BJP leaders were came into decision about this incident.