అసోంలో బిజేపి హవా

BJP won in Asom

05:06 PM ON 19th May, 2016 By Mirchi Vilas

BJP won in Asom

5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో భాగంగా అసోం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం బిజేపి ముందజంలో ఉంది. మొత్తం 126 స్థానాల్లో బిజేపి 84 స్థానాల్లో విజయం సాధించగా 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏఐయూడీఎఫ్‌ 12 స్థానాల్లో విజయం సాధించగా, ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ 25 స్థానాల్లోనూ, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తగ్గట్లే అసోంలో బిజేపి ఆధిక్యం కొనసాగుతోంది. తొలిసారిగా అసోంలో బిజేపి అధికారం సొంతం చేసుకున్నట్లయింది. దేశవ్యాప్తంగా బిజేపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కేరళ, పశ్చిమ బంగాలో కూడా బిజేపి ఖాతా తెరవడం ఆ పార్టీ నేతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

English summary

BJP won in Asom