శివాజీ రాజద్రోహం - పోలీసులకు ఫిర్యాదు

BJYM Filed Case Against Sivaji

11:35 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

BJYM Filed Case Against Sivaji

ఉన్నట్టుండి ఒక్కసారిగా నటుడు శివాజీ మళ్ళీ తెరమీదికి వచ్చాడు. సినిమా తెరమీదికి కాదు .. పొలిటికల్ తెరమీదికి .. అదేనండీ ఆమధ్య ఎపికి ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతూ, దీక్షల వరకూ వెళ్ళిన సంగతి తెల్సిందే. ఏపీకీ ప్రత్యేక హోదా అవసరం లేదంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి హెచ్.బీ.చౌదరి శుక్రవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎపి ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు అయిన శివాజి స్పందిస్తూ, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కార్పొరేట్ పైరవీల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈవిధంగా బిజెపి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తున్న శివాజీ పై బిజెపి నేతలు మండిపడుతున్నారు. దేశం నుంచి ఏపీని విడదీయాలంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రాజద్రోహం చేసే విధంగా శివాజీ వ్యాఖ్యలు ఉన్నాయని కమలనాధులు విరుచుకు పడుతున్నారు. అతడి పై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని బిజెపి యువమోర్చా అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డి అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

మనం ఎప్పుడు చనిపోతామో దీని ద్వారా తెలుసుకోవచ్చు!

అక్కడ అమ్మాయిలు చదువుకోవాలంటే వ్యభిచారం చెయ్యాల్సిందే!

గన్ దెబ్బకు పవన్ మూవీకి బ్రేకు?

English summary

BJYM and BJP Party Leaders were filed case against Actor Sivaji for saying that Give Andhra Pradesh as A Special Country. He spoke this words because of recently Central Minister said that There is no need of Special Status For Andhra Pradesh.