అసదుద్దీన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేవైఎం

BJYM Fires On Asaduddin Owaisi

04:50 PM ON 15th March, 2016 By Mirchi Vilas

BJYM Fires On Asaduddin Owaisi

గొంతుపై కత్తి పెట్టి బెదిరించినా ‘భారత్‌ మాతా కీ జై’ అని నినదించబోనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. బిజెపి అనుబంధ భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో విశాఖలో ఆందోళన చేపట్టారు. భారతదేశంలో పుట్టి పదవులు అనుభవిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆందోళనకారులు మండిపడ్డారు. జీవీఎంసీ ఎదుట అసదుద్దీన్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన పౌరసత్వం రద్దు చేయాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. మొత్తానికి అసద్ వ్యాఖ్యలు రాజుకున్నాయి. ఏదోలా వార్తల్లో ఉండాలిగా ...

మెడపైన కత్తి పెట్టినా.. భారత్ మాతా కీ జై అనేది లేదు

English summary

Bharatiya Janata Yuva Morcha (BJYM) fires on MIM Party leader and MP Asadudeen Owaisi .Asadudeem Owaisi Said that He never Say Bharata Mata Ki Jai even Some one puts sword on her neck.