బ్లాక్‌ఫ్రైడే షాపింగ్‌ మజా ఇండియా నుండి..

Black Friday Shopping From India

10:57 AM ON 27th November, 2015 By Mirchi Vilas

Black Friday Shopping From India

అమెరికాకు క్రిస్ట్‌మస్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు షాపింగ్‌ ప్రియులకు హద్దే ఉండదు. బ్లాక్‌ ఫ్రైడే, బ్లాక్‌ సైబర్‌ మండే పేరిట సగానికిపైగా డిస్కౌంట్లు ఇచ్చే షాపింగ్‌ సీజన్‌ కోసం ప్రతీ సగటు అమెరికన్‌ ఏడాది అంతా ఎదురు చూస్తాడంటే అతిశయోక్తికాదు. బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ పేరుతో అక్కడి ప్రతీ ఒక్కరు తమ స్థాయికి మించి వస్తువులను కొనుక్కొని తెగ సంబరపడిపోతారు. డిస్కౌంట్‌ సేల్‌ అంటే ఇండియాలోనే కాదు ప్రపంచమంతా ఉండే మోజుకు ఉదాహరణ ఇది.

ఇక ఇలాంటి డిస్కౌంట్‌ ధమాకా మనమూ పొందాలని ఉన్నా, కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లు ఇండియాకు ఆన్‌లైన్‌లో కొన్న వస్తువులను షిప్పింగ్‌ చేస్తున్నప్పటికీ మనం మాత్రం షిప్పింగ్‌ కాస్ట్‌కు భయపడి వెనుకడుగు వేస్తాము. ఎందుకంటే సదరు వస్తువు ధరకన్నా ఇండియాకు షిప్పింగ్‌ చేసే ధర అధికంగా ఉండడం వలన ఎవరూ ఆన్‌లైన్‌లో బ్లాక్‌ఫ్రైడే షాపింగ్‌ను ఇష్టపడరు. కానీ ఇప్పుడు అలాంటి బెంగలేకుండా ఏమాత్రం ఫ్రీ షిప్పింగ్‌ చేసే కొన్ని సైట్లను చూడండి

ఫ్రీ షిప్పింగ్‌ అంటే మీరు ఆన్‌లైన్‌లో కొన్న వస్తువులను చాలా తక్కువధరకే మీరు ఇండియాలో పొందవచ్చు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులలో విద్యాపరమైన వస్తువులకు దేశంలో కస్టమ్స్‌ సుంకం ఏ మాత్రం విధించరు. కాబట్టి ఈ కేటగిరీకి సంబంధించిన వస్తువులను మనం ఆన్‌లైన్‌ నుండి అత్యంత తక్కువ ధరకే పొందవచ్చన్న మాట. అలాంటి వస్తువులనే కొన్ని సైట్‌లు ఇండియాకు ఫ్రీ షిప్పింగ్‌ చేస్తాయన్న మాట. అలాంటి వెబ్‌సైట్‌ల వివరాలేమిటో చూద్దాం.

అబీబుక్స్‌

ఈ వెబ్‌సైట్‌ ప్రపంచవ్యాప్తంగా పుస్తకాల అమ్మకంలో అగ్రస్థానంలో ఉంది. మనం కూడా ఈ వెబ్‌సైట్‌నుండి ఇండియాకు ఫ్రీ షిప్పింగ్‌తో పుస్తకాలు కొనవచ్చు. ఇండియాలో దొరకడం ఎంతో కష్టమని భావించే సైన్స్‌, ఫిక్షన్‌ పుస్తకాలను ఈ వెబ్‌సైట్‌ నుండి ఎంతో తక్కువ ధరకు ఫ్రీ షిప్పింగ్‌తో పొందవచ్చు.

వెబ్‌సైట్ అడ్రస్

వాచిస్మో

ఈ వెబ్‌సైట్‌లో మీకు నచ్చిన ప్రపంచస్థాయి వాచీలను ఫ్రీ షిప్పింగ్‌ ద్వారా ఇండియాలో పొందవచ్చు. కానీ మీరు షాపింగ్‌ మొత్తం 199డాలర్లపైన అయితే ఈ వెబ్‌సైట్‌ మీ వస్తువులను ఉచితంగా ఇండియాకు షిప్పింగ్‌ చేసుకోవచ్చు. షిప్పింగ్‌కు 14 నుండి 28 రోజులు పడుతుంది.

బోర్న్‌ ప్రెట్టీ స్టోర్‌

అమెరికాకు చెందిన ఫ్యాషన్‌ యాక్సరీస్‌, నగలు, నెయిల్‌ ఆర్ట్‌, స్మార్ట్‌ ఫోన్‌ కేస్‌లు కొనాలనుకుంటున్నారా. ఈ వెబ్‌సైట్‌ సరైన వేదిక. ఎటువంటి మినిమమ్‌ ఆర్డర్‌ లిమిట్‌ లేకుండానే మీకు నచ్చిన వస్తువులను ఇండియాలో ఫ్రీ షిప్పింగ్‌ అందిస్తోంది ఈ వెబ్‌సైట్‌.

వెబ్‌సైట్ అడ్రస్

స్వరోస్కీ

ఇండియాలో కూడా సుపరిచితమైన ఈ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఇండియాలో కూడా దొరకని స్వరోస్కీ బ్రాండ్‌ ఫ్యాషన్‌ యాక్సరీస్‌లను మనం కొనుక్కొనే వీలుంది. 75 యూరోలు ( 5300 రూపాయలు) పైగా షాపింగ్‌ పై ఈ వెబ్‌సైట్‌ ఫ్రీ షిప్పింగ్‌ను అందిస్తోంది.

వెబ్‌సైట్ అడ్రస్

చిక్‌విష్‌

చిక్‌విష్‌ వెబ్‌సైట్‌లో దుస్తులు, ఫ్యాషన్‌ యాక్సెరీస్‌లను పొందవచ్చు. మీ షిప్పింగ్‌ను కేవలం 2డాలర్ల అదనపు రుసుముతో ట్రాక్‌ చేసుకునే వీలు కల్పిస్తోంది ఈ వెబ్‌సైట్‌.

వెబ్‌సైట్ అడ్రస్

బుక్‌ డిపోజిటరీ

అమెజాన్‌కు చెందిన ఈ బుక్‌ డిపోజిటరీ వెబ్‌సైట్‌ ద్వారా మీకు నచ్చిన పుస్తకాలను ఎటువంటి కస్టమ్స్‌ సుంకం లేకుండానే ఉచితంగా ఇండియాకు షిప్పింగ్‌ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్ అడ్రస్

ఆలీ ఎక్స్‌ప్రెస్‌

చైనాకు చెందిన ఆలీబాబా గ్రూపుకు చెందిన ఆలీఎక్స్‌ప్రెస్‌ వెబ్‌సైట్‌ ద్వారా మీరు మొబైల్‌ఫోన్ల నుండి దుస్తులు, ఫోన్‌ యాక్సరీస్‌ ఇలా చాలా రకాల వస్తువులను కొనుక్కునే వీలుంది. ఏమాత్రం షిప్పింగ్‌ ఫీజులు లేకుండా అంతర్జాతీయ వస్తువులను ఇండియాలో పొందవచ్చు.

వెబ్‌సైట్ అడ్రస్

డీల్‌ ఎక్స్‌ట్రీమ్‌

ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీరు కంప్యూటర్‌, రామ్‌ల నుండి 3డి ప్రింటర్‌ల దాకా మీరు కోరుకున్న ఎటువంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులనైనా పొందే వీలుంటుంది. ఈ వెబ్‌సైట్‌ కూడా ఇండియాకు ఫ్రీ షిప్పింగ్‌ను అందిస్తోంది. అత్యంత చవకగా హెడ్‌ఫోన్స్‌, బ్యాటరీ పాక్స్‌ను పొందవచ్చు.

వెబ్‌సైట్ అడ్రస్

ఈ వెబ్‌సైట్ల ద్వారా ఇండియాలో ఫ్రీ షిప్పింగ్‌ పొందేందుకు 14 నుండి 28రోజుల వరకూ పట్టవచ్చు. కానీ బ్లాక్‌ ఫ్రైడే, బ్లాక్‌మండే షాపింగ్‌ మజాను, డిస్కౌంట్లను ఇండియాలో కూడా పొందాలనుకుంటున్నారా అయితే ఆ మాత్రం ఆలస్యాన్ని భరించక తప్పదు. మరెందుకు లేటు షాపింగ్‌ మొదలుపెట్టండి.

English summary

Christmas Season is the most effective season for americans because they will shop alot in that season.Especially during sales like Black Friday and Cyber Monday - is great, but international shipping costs are high, often more than the price of the product itself.Here are some sites which offer great deals,and good discounts