డబ్బు కాపాడుకోడానికి మనోళ్లు చేస్తున్న ప్రయత్నాలు వింటే షాకౌతారు!

Black money people doing so many things

12:13 PM ON 11th November, 2016 By Mirchi Vilas

Black money people doing so many things

పెద్దనోట్లను రద్దుచేయడంతో ఎలాగోలా తమ దగ్గర వున్న డబ్బును కాపాడుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. నల్లకుబేరులు ఇప్పడు గుట్టలకొద్దీ ఉన్న బ్లాక్ మనీ చెల్లడం ఎలా అంశంపై దృష్టి పెట్టారు. ప్రతిచిన్న అవకాశాన్ని వినియోగించుకుంటున్నారట. ఇక కొన్ని వింతలూ, విడ్డూరాలూ చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు నల్లధనాన్ని అంటిపెట్టుకుని మురిసిపోయినవాళ్లు, ఇప్పుడు తెల్లమొహాలు వేశారు. ఇప్పటి వరకు చెలామణి అయిన బ్లాక్ మనీ సంగతి సరే.. ఇప్పుడే అసలు కథ మొదలైంది. వాటి వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

ఉన్న నల్ల ధనంలో సగం అయినా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమకు పరిచయస్తులు, తెలిసినవాళ్లకు ఎర వేస్తున్నారు. తమ వద్ద పనిచేసే వాళ్లకు, పరిచయస్తులకు ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తున్నారు. తమకు సేవ చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి చిన్నా చితక ప్రయత్నాలు చేస్తూనే పెద్ద మొత్తంలో నగదు మార్పిడి ఎలా అన్న కోణంలోనూ ఆలోచన చేస్తున్నారు. ఆర్థిక నిపుణులను ఆశ్రయిస్తున్నారు. బ్లాక్ మనీ మార్పిడిలోనూ రియలెస్టేట్ వ్యాపారులు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.

English summary

Black money people doing so many things