నోట్లకు నిప్పు పెట్టేసారు...

Black money people fired 500 and 1000 notes

10:31 AM ON 10th November, 2016 By Mirchi Vilas

Black money people fired 500 and 1000 notes

అవును నల్లధనం అవినీతి నిరోధానికి వీలుగా కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం కొందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. దొంగనోట్లు, నల్లధనం పెచ్చుమీరిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం కంగారు పుట్టిస్తోంది. కాగా ఉత్తరప్రదేశ్ బారెల్లీలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో బస్తాల నిండా వాటిని తెచ్చిన కొందరు నిప్పుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలిన నోట్లను స్వాధీనం చేసుకుని ఆర్బీఐ అధికారులకు సమాచారం అందించారు. ఓ కంపెనీకి చెందిన వర్కర్లు బస్తాల్లో రూ.500, రూ.1000 నోట్లను తెచ్చి తగులబెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Black money people fired 500 and 1000 notes