దాన కర్ణుల అవతారం ఎత్తిన నల్ల కుభేరులు!

Black money people giving their money without interest

11:42 AM ON 12th November, 2016 By Mirchi Vilas

Black money people giving their money without interest

ఉన్నట్టుండి పెద్ద నోట్లు చెల్లవని ప్రధాని మోడీ ప్రకటించడంతో ఖంగుతిన్న నల్ల కుభేరులు తమ వద్దనున్న కోట్లాది రూపాయలను కొత్త నోట్లలోకి మార్చుకునేందుకు చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి. రకరకాల ప్రయత్నాల్లో భాగంగా నోట్ల మార్పిడికి వారికి ఓ ఉపాయం ఆలోచించి, ఉన్నట్టుండి అపర దానకర్ణులైపోయారు. విషయం ఏమంటే, చెన్నై, పరిసర ప్రాంతాలలో గుడిసెలు, పెంకుటిళ్లలో నివసిస్తున్న పేదల వద్దకు వెళ్లి... మీకు లక్ష రూపాయల దాకా వడ్డీ లేకుండా రుణమిస్తాం. వాటిని వచ్చే యేడాది జనవరిలో తిరిగిస్తే చాలు అని మాయమాటలతో ఊరిస్తున్నారు.

కొన్ని చోట్ల భవంతులలో నివసిస్తున్న ధనవంతులు తమ తరఫు ప్రతినిధులను కాలనీలకు పంపి పేద, మధ్యతరగతి ప్రజల వద్దకు పంపి లక్ష రూపాయల దాకా వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రుణం తీసుకునే వారి చేతుల్లో ఆ నల్ల ధనవంతులు రూ. 500, 1000 పెద్ద నోట్లనే పెడుతున్నారు. ఇది చూసి వాళ్ళు అవాక్కవుతున్నారు.

English summary

Black money people giving their money without interest