మొబైల్ ఫోన్లకు బ్లాక్ బెర్రీ గుడ్ బై!

Blackberry company says good bye to mobile phones

03:27 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Blackberry company says good bye to mobile phones

దశాబ్ధం కిందట అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల్లో ఒకటైన బ్లాక్ బెర్రీ.. కెనడా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం బ్లాక్ బెర్రీ మొబైళ్ల తయారీకి స్వస్తి పలకనుంది. ఇకపై ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. బ్లాక్ బెర్రీ పేరు కలిగిన హ్యాండ్ సెట్లు ఇండోనేషియా భాగస్వామ్య సంస్థ పీటీ టిఫోన్ మొబైల్ ఇండోనేషియా టీబీకే తయారు చేయనుంది. భవిష్యత్ వృద్ధి కోసం మొబైళ్ల తయారీని ఆపివేసి.. భద్రతా సాఫ్ట్ వేర్ పై దృష్టి పెట్టనున్నట్లు బ్లాక్ బెర్రీ వెల్లడించింది. మా వ్యూహాలతో కీలక దశకు చేరుకుంటున్నాం. మా ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. మా సాఫ్ట్ వేర్ ఉత్పత్తులు రెట్టింపు ఆదాయాలు ఇస్తున్నాయి అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ చెన్ అన్నారు.

1/4 Pages

ఇదీ కంపెనీ ప్రస్థానం...


బ్లాక్ బెర్రీని అప్పట్లో రీసెర్చ్ ఇన్ మోషన్ లిమిటెడ్(రిమ్)గా వ్యవహరించేవారు. 2001 ప్రారంభంలో రిమ్ బ్లాక్ బెర్రీ మొబైళ్లను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కెమేరా వంటి మల్టీమీడియా ఫీచర్లతో బ్లాక్ బెర్రీ పెర్ల్ 8100ను విడుదల చేసింది. ఈ మోడల్ భారీ విజయం సాధించడంతో వెంట వెంటనే కర్వ్ 8300 సిరీస్, బోల్డ్ 9000 సిరీస్ లను విడుదల చేసి దూసుకెళ్లింది. 2007లో యాపిల్ మొదటి ఐఫోన్ విడుదలైనప్పటికీ.. బ్లాక్ బెర్రీ మార్కెట్ వాటా 2011 వరకు చెక్కుచెదరలేదు. 2012 డిసెంబరుకి కంపెనీకి 7.9 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

English summary

Blackberry company says good bye to mobile phones