బ్లాక్‌బెర్రీ నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్.. ప్రీవ్

BlackBerry Priv Android Smartphone

01:13 PM ON 26th January, 2016 By Mirchi Vilas

BlackBerry Priv Android Smartphone

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ తన తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ను రెడీ చేస్తోంది. ప్రివ్‌ పేరుతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెల 28న మార్కెట్‌లోకి విడుదల కానుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను కంపెనీ ఇంకా వెల్ల‌డించ‌లేదు. అయితే దీని ధర రూ. 46,200గా ఉండొచ్చని తెలుస్తోంది. స్లైడర్ కీబోర్డ్‌ ఈ ఫోన్ ప్రత్యేకత. దీంతోపాటు ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ లేని విధంగా 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ను ఇందులో అందిస్తున్నారు.

బ్లాక్‌బెర్రీ ప్రివ్‌ ఫీచ‌ర్లు ఇవే..

5.4 ఇంచ్ ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే, 1440X2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.44 జీహెచ్‌జడ్ హెగ్జాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 18 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 3410 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, స్లైడర్ కీబోర్డ్‌.

English summary

Blackberry launched its first ever android smart phone. This smartphone to be released in India by january 28th 2016. The price of this smart phone would be Rs. 47,300 and comes with features like Android 5.1.1 Lollipop,5.4-inch QHD Amoled display,1.8GHz dual-core Cortex-A57 Processor,4K video recording