భారత్‌లోకి బ్లాక్‌బెర్రీ.. ప్రైవ్

Blackberry Priv Launched In Inida

04:38 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Blackberry Priv Launched In Inida

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. బ్లాక్ బెర్రీ ఇప్పటివరకు తన సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌తోనే ఫోన్లను విడుదల చేయగా.. మారుతున్న వినియోగదారుల అభిరుచులు, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రైవ్‌ పేరుతో తొలి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను రూపొందించింది. ఇప్పటికే అమెరికా, కెనడాల్లో ఈ ఫోన్లు విడుదల చేయగా.. తాజాగా భారత మార్కెట్లోకి దీనిని తీసుకొచ్చింది. దీని ధర రూ. 62,990. టచ్‌స్క్రీన్‌తో పాటు క్వెర్టీ కీబోర్డు కూడా ఉండేలా దీనిని రూపొందించింది. ఇటీవలి కాలంలో వస్తున్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో కీబోర్డు కలిగిన ఫోన్‌ ఇదొక్కటే. గురువారమే ఈ ఫోన్ ను భారత్ లో విడుదల చేయగా.. జనవరి 30 నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రైవ్ ఫోన్‌ ఫీచర్లు ఇవే..

5.4 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్‌ హెగ్జాకోర్‌ ప్రొసెసర్‌, 3జీబీ రామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, సింగిల్ సిమ్‌ సదుపాయం, 18 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 2 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, 4జీ సపోర్టింగ్‌, క్వెర్టీ కీబోర్డు

English summary

Blackberry mobile company launched BlackBerry Priv Android SmartPhone in India.The price of this smartphone was Rs. 62,990 and it comes with the features like Android 5.1.1 Lollipop,5.4-inch Amoled display,Qualcomm Snapdragon 808 hexa-core processor,3GB of RAM,4G,3410mAh battery