ఏంటీ 'బ్లూ స్టాక్స్ 2.0'?

Blue Stacks Software New Update

05:10 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Blue Stacks Software New Update

'బ్లూ స్టాక్స్' 'విండోస్ పీసీ'లో 'ఆండ్రాయిడ్ యాప్స్‌'ను రన్ చేసే సాఫ్ట్‌వేర్. అధిక శాతం మంది యూజర్లు ఇప్పటికే దీన్ని వాడుతున్నారు. కాగా ఈ సాఫ్ట్‌వేర్‌కు చెందిన నూతన వెర్షన్ విండోస్ పీసీ యూజర్లకు ఇప్పుడు విడుదలైంది.

ఇంతకు ముందు వెర్షన్‌లో ఒకసారి కేవలం ఒకే యాప్‌ను రన్ చేసుకునేందుకు వీలుండగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన 'బ్లూ స్టాక్స్ 2.0' అప్‌డేట్ ద్వారా యూజర్లు ఒకేసారి ఎక్కువ యాప్స్‌ను రన్ చేసుకునేందుకు వీలుంది. దీంతోపాటు లొకేషన్, వాల్యూమ్ తదితర సెట్టింగ్‌లు మరింత సమర్థవంతంగా పనిచేసేలా ఫీచర్లు అందిస్తున్నారు.

ఈ కొత్త వెర్షన్ ఇంటర్నెట్ బ్రౌజర్ లాంటి ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుందని సదరు సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తమ సాఫ్ట్‌వేర్‌ను రోజుకి 2 లక్షల మంది కొత్త యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని, త్వరలోనే మరిన్ని ఫీచర్లతో నూతన అప్‌డేట్‌ను అందిస్తామని వారు చెపుతున్నారు.

English summary

Blue Stacks App which allows you to run android apps on windows pc. The new version of blue stack was released by its company in that new update we can open and run multiple apps at a time