క్యాన్సర్ రోగులకు శుభవార్త

Blushwood Berries Destroy Cancer Cells

04:42 PM ON 25th May, 2016 By Mirchi Vilas

 Blushwood Berries Destroy Cancer Cells

ఈ ఆధునిక యుగంలోను ప్రపంచ దేశాలంతటా అందరినీ భయపెడుతున్న భయంకరమైన వ్యాదులలో క్యాన్సర్ కూడా ఒకటి. ఏ రోగానికి అయినా కుల, మత, ప్రాంత భేదం ఉండదు. ఎంతటి వారైన రోగాల భారిన పడాల్సిందే. ఎంతో మంది ప్రముఖులు క్యాన్సర్ భారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఈ వ్యాధి వచ్చినట్లయితే నయం కావడం చాలా కష్టం. వ్యాధి ప్రారంభ దశలో ఉంటే మెడిసిన్ వాడటం ద్వారా నయం చేయవచ్చు. కానీ.. వ్యాధి ముదిరితే మాత్రం వైద్యులు సైతం ఏమీ చేయలేం అంటారు. క్యాన్సర్ బారిన పడ్డ వారు దాని నుంచి బయట పడటానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. అయినా ఫలితం కానరావడం లేదు. అయితే ఎంతో భయంకరమైన ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు ఒక మార్గం ఉంది. ఒక పండును తినడం ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నయం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ పండు ఏమిటి ? అక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తున్నారా?

ఒక పండు, తింటే నిమిషాలలోనే క్యాన్సర్ కణాలను ధ్వంసం చేస్తుందని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పండు పేరు బ్లాష్ వుడ్, ఇది ఆస్ట్రేలియాలోని తూర్పు క్వీన్ ల్యాండ్ అడవుల్లో లభిస్తుంది. ఈ పండులోని గింజలతో తయారయ్యే మందుతో క్యాన్సర్ ని తగించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మందుని ఈబిసి-46 అని అంటారు. ఈబిసి-46 పై మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రాబోయే ఇంకొన్ని సంవత్సరాలల్లో ఈ ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం ఈ ఔషధం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ సంభవించే అవకాశాలు ఉన్నాయని, అందుకని, మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు అందజేయాలన్న ధ్యేయంతో శాస్త్రవేత్తలు ఉన్నారట. మరి నిజంగా క్యాన్సర్ రోగులకు ఇది శుభవార్తే......

ఇవి కూడా చదవండి:వేడిచేయకూడని ఆహార పదార్ధాలు

ఇవి కూడా చదవండి:జిమ్ కి వెళితే వచ్చే జబ్బులు ఇవే

English summary

According to a study conducted by QIMR Berghofer Medical Research Institute in Queensland from Australia found that Blushwood Berries Destroy Cancer Cells. This was the best medicine for the cure of cancer.