బీఎంఐ కొలమానం కరెక్టేనా..?

BMI is wrongly branding people unhealthy

10:38 AM ON 6th February, 2016 By Mirchi Vilas

BMI is wrongly branding people unhealthy

బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ).. అదేనండీ.. శరీర ద్రవ్యరాశి సూచిక.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునే చాలామంది ఫాలో అయ్యే కొలమానం ఇదే. సంపూర్ణ ఆరోగ్యానికి శరీర బరువు, ఎత్తుల నిష్పత్తి కోసం ఎక్కువ మంది బీఎంఐ పైనే ఆధారపడుతున్నారు. అయితే బీఐఎస్ కొలమానం పూర్తిగా సరైనది కాదట. ఇది చాలామందిని అనారోగ్యంగా ఉన్నారనే ముద్ర వేయటానికి దారితీస్తోందట. ఈ విషయం యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకుల రిసెర్చ్ లో వెల్లడైంది. సాధారణంగా వ్యక్తుల ఎత్తును ఎత్తుతో (మీటర్లలో) గుణించి.. శరీర బరువుతో (కిలోల్లో) భాగించి బీఎంఐని లెక్కిస్తారు. దీనికీ.. రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల స్థాయులు, రక్తపోటుకు గల సంబంధాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. బీఎంఐ ప్రకారం ఊబకాయులుగా, అధికబరువు గలవారిగా ముద్రవేసినవారిలో దాదాపు సగం మంది ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే బీఎంఐ ప్రకారం సాధారణ స్థాయిలో గలవారిలో 30% కంటే ఎక్కువ మంది ఇతర ఆరోగ్యసూచికల మేరకు అనారోగ్యంగా ఉన్నట్టూ తేలింది. బీఎంఐ 35, అంతకన్నా ఎక్కువగా ఉండటంతో భారీ ఊబకాయులుగా పరిగణిస్తున్న అమెరికన్లలో సుమారు 15% మంది నిజంగా ఆరోగ్యంగానే ఉన్నారని పరిశోధకులు తెలిపారు. అందువల్ల అధిక బరువు గలవారిని చిన్నచూపు చూడటం తగదని.. ప్రజలు తమ బరువు కన్నా పోషకాహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటంపై దృష్టి పెట్టాలని సూచించారు. బీఎంఐ 18.5 నుంచి 24.99 వరకు ఉండటాన్ని సాధారణ స్థాయిగా భావిస్తారు. కానీ ఆరోగ్యానికి ఇదే ప్రధానమైన కొలమానం కాదని పరిశోధకులు చెపుతున్నారు.

English summary

In a new research found that half of people labelled 'obese' through BMI scores are actually healthy.Almost half of people diagnosed as obese using Body Mass Index measurements are actually healthy, according to new research.