స్టార్ డైరెక్టర్ ఇంటిపై బాంబులతో దాడి?

Bobm Attack On Tamil Top Director Hari

11:15 AM ON 25th August, 2016 By Mirchi Vilas

Bobm Attack On Tamil Top Director Hari

అవునా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే, సాధారణంగా అగ్ర హీరోల చిత్రాలు పరాజయం పాలైనప్పుడు ఆ హీరోల అభిమానులు, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు సినిమా దర్శకుడు, నిర్మాతల పై దాడికి దిగడం ఇటీవల కాలంలో సర్వ సాధారణం అయింది. ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్ లో ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి.

అయితే, కోలీవుడ్ కి చెందిన ఒక అగ్రదర్శకుడి ఇంటి పై కొందరు ఏకంగా బాంబులతో తెగబడ్డారు. ఆయన సినిమాల్లో ఎలాంటి సీన్లు ఉంటాయో సరిగ్గా ఈయనపై కూడా అలాగే దాడి జరిగిందని అంటున్నారు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. సామి, సింగం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన హరి. అయితే, ఈయనపై దాడి జరిగింది మాత్రం సినిమాకు సంబంధించి కాదట. తన ఇంటి పక్కన ఉన్నవాళ్లతో కారు పార్కింగ్ విషయంలో హరికి గొడవైంది.

దీంతో కార్తీక్, కరుప్ప స్వామిలు హరితో గొడవపడ్డారు. అంతేకాకుండా చంపేస్తామని కూడా బెదిరించారని కోలీవుడ్ లో టాక్. బెదిరించడంతో సరిపెట్టకుండా హరి ఇంటిపై రెండు బాంబులను విసిరేశారట. దీంతో భయబ్రాంతులకు గురైన హరి వెంటనే విరుంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ దాడికి తెగబడ్డాడని హరి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి ఘటనల విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ఇండస్ట్రీ లోని చాలామంది కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:చిన్నారుల హృదయ స్పందన (వీడియో)

ఇవి కూడా చదవండి:అది పెద్ద విమానం ల్యాండింగ్ సమయంలో ఏమైందో తెలుసా (వీడియో)

English summary

One of the Top director in Tamil who directed the films like Singam was attacked by Bomb in Tamilnadu. He filed a complaint on his neighbors named Karthik and Karuppa Saamy for attacking with bombs. These two people were quarreling with Director Hari from few days on Car Parking Issue.