నవ్వు వెనుక ఏముంది ??

Body language of smiles

04:13 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Body language of smiles

ప్రతిరోజూ చాలా మందిని చూస్తూ ఉంటాం. అందరూ ఒక్కో విధంగా నవ్వుతూ పలకరిస్తారు. కాని ఆ నవ్వుకి అర్ధం ఏమిటా అని ఎప్పుడైనా ఆలోచించారా.. కొంతమంది మనస్పూర్తి గా మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు అనే భావన మీకు కలుగుతుంది. కొంతమందిని చూస్తే అసలు ఏమీ అర్ధం కాదు. ఒకొక్కరూ ఒక్కోవిధంగా నవ్వుతారు. కొంతమంది పళ్ళు కనబడేలా గట్టిగా నవ్వుతారు. కొంతమంది మూతి బిగబెట్టి శబ్ధం లేకుండా నవ్వుతారు. ఒక్కొక్కరూ ఒక్కో విధమైన స్టైల్స్‌ తో నవ్వుతుంటారు. కాని సందర్బాను సారంగా వారి మనస్సులో  ఏం అనిపిస్తుందో అది నవ్వురూపంలో బయటకు వస్తుంది. వాటికి అర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/6 Pages

1. టైట్‌ లిప్స్‌ స్మైల్‌

సాదారణంగా చాలా సందర్బాలలో పళ్ళు కనబడకుండా చిన్నగా నవ్వుతూ ఉంటాం. ఎవరైనా ఎదురైనప్పుడు, అవసరమైనప్పుడు ఒక చిరునవ్వు నవ్వుతాము. నిజానికి ఇది నకిలీ నవ్వు అంటున్నారు నిపుణులు. ఇది చాలా సందర్బాలలో నకిలీ నవ్వే. ఎందుకంటే నిజంగా సంతోషంగా ఉంటే కచ్చితంగా నోరు తెరచి నవ్వుతామట. మన భావాలను చాలా కారణాల వల్ల లోపలే దాచేస్తాము. భయం, పిరికితనం, సిగ్గు, మర్యాద మొదలగు వాటి వల్ల మన భావాలను నిర్బయంగా భయపెట్టలేము.ఈ టైట్‌ లిప్స్‌ స్మైల్‌కి కచ్చితమైన అర్ధం చెప్పాలంటే పళ్ళను ఏవిధంగా లోపల దాచి ఉంచుతున్నామో అదేవిధంగా మన భావాలను కూడా రహస్యంగా దాచేస్తున్నామని అర్ధం.

అలా అని అందరికీ ఇది వర్తించదండీ బాబు.. కొంతమంది తమ పళ్ల వరుసలు బాగోలేక లేదా ఫోటోలలో బాగా పడమని వివిధ సందర్బాలలో తమ పళ్ళు కనపడకూడదని దాచేస్తుంటారు. అందువల్ల అందరిదీ ఫేక్‌ అని అనుకోకూడదు.

English summary

Different type of smiling faces we meet every day. We are taught from an early age that smiling is good, that we should be happy and smiling is the way to show it.