ఈ సరస్సులో నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది.. ఎందుకో తెలుసా?

Boiling lake Dominica

11:23 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Boiling lake Dominica

ఈ ప్రకృతిలో ఎన్నో వింతలూ, అద్భుతాలు వున్నాయి. మిరాకిల్ లాంటి ఎన్నో విషయాలున్నాయి. పంచభూతాల సాక్షిగా ఎన్నో అంశాలున్నాయి. ముఖ్యంగా అగ్నిపర్వతాల గురించి చెప్పుకుంటే, అవి ఎప్పుడూ లావా నిప్పులు కక్కుతూనే ఉంటాయి. అది సహజం. అయితే సరస్సుల్లో నీరు సలసల మసలడం తెలుసా? అవును, నిజం డొమినికా దేశానికి చెందిన ఓ సరస్సు ఎప్పుడూ సెగలు కక్కుతూనే వుంటుందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

కరేబియన్ దేశాల్లో ఒకటైన డొమినికాలోని ది మోర్నే ట్రోయిస్ పీటన్స్ నేషనల్ పార్కులో ఈ బాయిలింగ్ సరస్సు కనిపిస్తుంది. ఈ పార్కు చుట్టూ ఐదు భారీ అగ్నిపర్వతాలు, వందల సంఖ్యలో అగ్నిపర్వత బిలాలు ఉన్నాయి. అందులోని ఓ బిలం చుట్టూ నీరు చేరడంతో ఈ వేడినీటి సరస్సు ఏర్పడింది. లోపలి నుంచి వచ్చే వేడి వల్ల ఈ సరస్సులోని నీరు ఎప్పుడూ వేడేక్కుతూ ఉంటుంది. 76 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల లోతు ఉన్న ఈ సరస్సులో ఎప్పుడూ 80 నుంచి 90 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. అంటే.. నీరు ఎప్పుడూ సలసల మరుగుతూనే ఉంటుందన్నమాట. వివరాల్లోకి వెళితే...

English summary

Boiling lake Dominica. The boiling lake in Dominica.