నైజీరియాలో రెచ్చిపోయిన బొకోహరాం

Boko Haram attack in Nigeria

07:01 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Boko Haram attack in Nigeria

ఆఫ్రికా దేశం నైజీరియాలో బొకోహరాం ఉగ్రవాదులు మరోసారి మారణహోమానికి తెగబడ్డారు. మూడు గ్రామాలపై దాడిచేసి 30 మంది అమాయక పౌరులను ఊచకోత కోశారు. మరో 20 మందిని గాయపరిచారు. దీంతో మిగతా గ్రామస్తులు ప్రాణభయంతో ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ఆ తర్వాత ఉగ్రవాదులు ఇళ్లను తగలబెట్టి వెళ్లిపోయారు. శనివారం చోటుచేసుకున్న ఈ మారణహోమం వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బురా షికా రాష్ట్రంలోని వర్వారా, మంగారి, బురాషికా గ్రామాలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఉగ్రమూకలు.. దొరికినవాళ్లను దొరికినట్లు గొంతులు కోశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయకపోవడం వల్లే ఈ సంఘటన గురించి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసిందని బొకోహరాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్తలు చెప్పుకొచ్చారు. 2009లో నైజీరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటినుంచి బొకోహరాం ఉగ్రవాదులు 17 వేల మందిని ఊచకోత కోశారు.

English summary

Boko Haram militants attacked in Nigeria, in that attack 30 people were dead, 20 people were injured