బొకోహరాం దాడుల్లో 15మంది మృతి

Boko Haram Terroists Kills 15 People In Nigeria

07:10 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Boko Haram Terroists Kills 15 People In Nigeria

నైజీరియాలో బొకోహరాం ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మైదుగురి పట్టణంలో బొకోహరాం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 15మంది మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. దాదాపు 10మంది ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో బొకోహరాం ఉగ్రవాదులు పలు మార్లు దాడులకు పాల్పడ్డారు. 2009లో వీరు చేసిన దాడుల్లో 700మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

English summary